తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్
నేడు గవర్నర్‌కు అధికారిక లేఖ కేసీఆరే
అర్హుడు : కేకే
మేనిఫెస్టో అమలు చేస్తాం
నీతివంతమైన పాలన అందిస్తాం: ఈటెల
హైదరాబాద్, మే 17 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చం ద్రశేఖరరావు త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష నేతగా ఆయన ఎన్నికయ్యారు. శనివారం తెలంగాణ భవన్‌లో సమావేశమైన శాసన సభపక్షం తమ నేతగా కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుం ది. మధ్యాహ్నం నిర్వహించిన శాసనసభపక్ష, పార్లమెంటరీ పార్టీ సమావేశానికి గెలు పొందిన ఎమ్మె ల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో కేసీఆర్ పేరును స్టేషన్‌ఘణ్ పూర్ ఎమ్మెల్యే డాక్టర్ టి. రాజయ్య ప్రతిపాదించగా, సీనియర్ నేత ఈటెల రాజేందర్, వి. శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపా రు. దళిత నేతలు కూడా కేసీఆర్‌కు మద్దతు ప్రకటించారు. దళితుడినే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిని చేస్తామని కేసీఆర్ గతంలో ప్రకటించారు. అయితే, మారిన రా జకీయ పరిస్థితుల నేప థ్యంలో ఆయనే ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు ముందుకు వచ్చారు. ఈక్రమంలో దళిత వర్గానికే చెందిన రాజయ్య ద్వారా కేసీఆర్ పేరును పార్టీ ప్రతిపాదింపజేసింది. పార్టీ శాసనసభ పక్షనేతగా నవ తెలంగాణ నిర్మాణ బాధ్యతలు చేపట్టేందుకు ఉద్యుక్తులయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అయ్యే మ్యాజిక్ ఫిగర్‌ను దాటి ప్రభుత్వా న్ని ఏర్పాటు చేయనుంది. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉండగా.. టీఆర్‌ఎస్ సొంతంగా 63 స్థానాలు దక్కించుకుంది. అలాగే 17 లోక్‌సభ స్థానాలకు గాను 11 చోట్ల భారీ విజయం నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో శనివారం పా ర్టీ శాసనసభా సమావేశం జరిగింది. సభాపక్ష నేత ఎన్నికతో పాటు ప్ర మాణ స్వీకారం, ప్రభుత్వ ప్రాధమ్యాలు, మేనిఫెస్టో అమలు తదితర అం శాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అలాగే, జిల్లాల వారీగా పార్టీ సాధించిన విజయాలపై సవిూక్షించినట్లు తెలిసింది. పార్టీకి ఒంటిచే త్తో విజయం సాధించిన కేసీఆర్‌ను శాసనసభాపక్షం అభినందించింది.
పార్లమెంటరీ పార్టీ నేతగా కడియం!
టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా దళిత సామాజిక వర్గానికి చెందిన కడియం శ్రీహరిని ఎన్నుకున్నట్లు
సమాచారం. శనివారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పార్లమెంటరీ నేతగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర వహించాల్సి ఉండడంతో ఎవరిని ఎన్నుకోవాలనే దానిపై పార్టీలో విస్తృతంగా చర్చ జరిగింది. కడియం శ్రీహరి, బి. వినోద్‌కుమార్, జితేందర్‌రెడ్డి పేర్లు ప్రధానంగా చర్చకు వచ్చాయి. రాజకీయ, పరిపాలన అనుభవం ఉన్న కడియం వైపు చాలా మంది మొగ్గు చూపినట్లు సమాచారం. వినోద్, జితేందర్‌రెడ్డి పేరు కూడా గట్టిగానే వినిపించింది. అయితే, సామాజిక సమతౌల్యం నేపథ్యంలో కడియం పేరుకు కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. మాజీ మంత్రిగా, సీనియర్ నాయకుడిగా విశేష అనుభవం కడియం సొంతం