నల్లధనం వెలికితీతకు సిట్ ఏర్పాటు
జస్టిస్ షా నేతృత్వంలో ప్రత్యేక బృందం
మోడీ మొదటి కేబినెట్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ, మే 27 (జనంసాక్షి) :
విదేశీ బ్యాంకుల్లో మగ్గుతున్న నల్లధనం వెలికితీతకు నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. భారత ప్రధానమంత్రిగా మం గళవారం బాధ్యతలు స్వీకరించిన నరేంద్రమోడీ ప్రధానంగా దేశ ఆర్థిక వనరులపై దృష్టి కేంద్రీకరించారు. ఇందుకుగానూ మంగళవారం సాయంత్రం 5 గంటలకు మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సుమారు రెండు గంటలపాటు జరిగింది. ఇందులో పలు కీలకాంశాలపై చర్చించినట్టు తెలిసింది. సమావేశానంతరం న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, నేటి సమావేశంలో ఆర్థిక వన రులు, న్యాయపరంగా ప్రభుత్వం ఎదుర్కొనే అంశాలు, రైల్వే ప్రమాదాలు మొదలైన అం శాలపై చర్చించినట్టు తెలిపారు. ముఖ్యంగా విదేశీ బ్యాంకుల్లో మగ్గుతున్న నల్లధనం వెలి కితీతపై ప్రధానంగా చర్చించినట్టు చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నల్లధనాన్ని వెలికితీసేందుకు జస్టిస్ షా నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తూ కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుందన్నారు. ఈ బృందంలో రెవెన్యూ కార్యదర్శి, ఆర్‌బీఐ, డెప్యూటీ గవర్నర్, ఐబీ, సీబీఐ సభ్యులుగా ఉంటారని అన్నారు. అలాగే సుప్రీంకోర్టులో ప్రభు త్వానికి న్యాయపరంగా ఎదురయ్యే సమస్యలపై పిటిషన్లు ఎలా వేయాలి, సిట్, యూపీఏ మొదలైన రివ్యూ పిటిషన్లు వేయడంపై చర్చించినట్టు చెప్పారు. తమ మంత్రివర్గం ప్రమా ణ స్వీకారం చేసిన రోజున జరిగిన రైలు ప్రమాదంపై సమావేశం విచారం వ్యక్తం చేసింది. ఇందుకుగానూ సమావేశం రెండు నిముషాలు మౌనం పాటించి మృతులకు సంతాపం ప్రకటించినట్లు ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర విభజన, పోలవరం ప్రా జెక్టు వ్యవహారం మొదలైన వాటిపై చర్చించారా అని విలేకరి అడుగగా, అవేమీ నేటి చర్చలో ప్రస్తావనకు రాలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆర్డినెన్స్ తీసు కురాబోతున్నారు అన్న వార్తపై ప్రశ్నించగా, మొదటి సమావేశంలో ఆర్డినెన్స్ ఎలా చర్చ కు వస్తుందని మంత్రి ప్రశ్నించారు. మొట్టమొదటి సమావేశం కీలకాంశాలపైనే జరిగినట్టు రవిశంకర్ చెప్పారు.