నేడు తెలంగాణ బంద్
కేంద్ర ఆర్డినెన్స్‌పై కేసీఆర్ ఆగ్రహం శ్రీ ప్రాజెక్టు నమూనా మార్చాల్సిందే
ఆదివాసీలను ముంచడం.. తెలంగాణ గ్రామాలను బదలాయించడం సహించం
బంద్‌కు మద్దతిచ్చిన విద్యార్థి, ఉద్యోగ, కార్మిక, వ్యాపార వర్గాలు శ్రీగవర్నర్‌ను కలిసిన కేసీఆర్
న్యూఢిల్లీ/హైదరాబాద్, మే 28 (జనంసాక్షి) :
పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్ర విలీనం చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ గురువారం తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు టీఆర్‌ఎస్ అధినేత కేసీ ఆర్ తెలిపారు. సీమాంధ్ర నాయుళ్లు చాపకింద నీరులా కుట్రలు చేసి ఈ ఆర్డినెన్స్‌ను తెచ్చుకున్నారని ఆయన మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు గ్రా మాలను అవశేష ఆంధ్ర ప్రదేశ్‌లో కలిపే ఆర్డినెన్స్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెల పడం, రాష్ట్రపతి ప్రణబ్ ఆమోద్ తెలపడం చకచకా జరిగిపోయాయి. దీంతో కేసీఆర్ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. ఓ వైపు ఇక్కడ ఆందోళనలు చేస్తున్నా పట్టిం చుకోకుండా గిరిజనాన్ని గోదావరిలో ముంచే దారుణ నిర్ణయం తీసుకున్నారు. కేబినే ట్ భేటీకి ముందే విషయం పసిగట్టిన తెలంగాణకు కాబోయే సిఎం కెసిఆర్ ఆర్డినె న్స్‌ను వ్యతిరేకించారు. పోలవరంపై అభ్యంతరం లేదని అయితే ముంపు గ్రామాలను వదులుకోబోమన్నారు. అంతేగాకుండా పోలవరం డిజైన్ మార్చి కట్టుకోవాలన్నారు. ఏకంగా భద్రాచలంలోని 7 మండలాలను ఆంధ్రాలో కలిపేందుకు ఆర్డినెన్స్‌ను కేం ద్రం పాస్ చేయనుంది. కేంద్రం ప్రభుత్వ వైఖరిపై తెలంగాణకు కాబోయే సీఏం కేసీ ఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణపై మోడీ సర్కార్ వైఖరికి నిరసనగా రేపు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. అన్ని వర్గాల వారు బంద్‌కు స్వచ్ఛంధంగా సహ కరించాలని కోరారు. అప్రజాస్వామికమైన ఆర్డినెన్స్‌ను ఆమోదించొద్దన్న విజ్ఞప్తులను పట్టించుకోకపోవడాన్ని కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణ యాన్ని ఆయన తప్పబట్టారు. ఇది తెలంగాణను దెబ్బతీసే కుట్రని అన్నారు. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రాలో కలుపాలని కేంద్రం చేస్తున్న కుట్రలపై కాబో యే తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌మండిపడ్డారు. ఈ అప్రజాస్వామికమైన ఆర్డినెన్స్‌ను ఆమోదించవద్దని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి విజ్ఞప్తి చేశారు. కేంద్రం వైఖరిని కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు.
బంద్‌కు అన్ని వర్గాల మద్దతు
ఆంధ్రా నాయకుల స్వార్థ రాజకీయాలకు కేంద్ర ప్రభుత్వం వంతపాడటంపై తెలంగాణ వాదులు, మేధావులు, యావత్ తెలంగాణ ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంద్‌కు అన్ని ఉద్యోగ, వ్యాపార, విద్యార్థి సంఘాలు మద్దతు ఇచ్చాయి. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలపాలని కేంద్రం చేస్తున్న కుట్రలపై కేసీఆర్ రేపు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ బంద్‌కు అన్ని సంఘాలు మద్దతు తెలిపాయి. టీఎన్జీవో, టీ గ్రూప్ 1 ఆపీసర్స్ జేఏసీ, డాక్టర్స్ జేఏసీ, న్యాయవాదుల జేఏసీ, టీ పీఆర్‌టీయూ, టీ కార్మిక విభాగం, టీ ఇంజినీర్స్ అసోసియేషన్, టీ బిల్డర్స్ అసోసియేషన్, టీ భవన కార్మిక సంఘం, టీ బీఎస్‌ఎన్‌ఎల్ వెల్ఫేర్ అసోసియేషన్, టీచర్స్ జేఏసీ, ఓయూ జేఏసీ, కేయూ జేఏసీ, తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ, టీ ఎంప్లాయిస్ జేఏసీ, టీ ఉద్యోగ జేఏసీ, తెలంగాణ యాదవ సంఘం, పారామెడికల్ ఇనిస్టిట్యూషన్స్ అసోసియేషన్ ,టీ విద్యుత్ ఉద్యోగ జేఏసీ, టీ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ తో పాటు పలు సంఘాలు బంద్‌కు మద్దతు ప్రకటించాయి.
గిరిజన గ్రామాల్లో టెన్షన్
ఖమ్మం : నిజానికి ప్రధాని నరేంద్రమోడీ తొలి క్యాబినేట్ సమావేశంలో పోలవరం ముంపుపై ఏదైనా నిర్ణయం వెల్లడిస్తారేమోనని ఖమ్మం జిల్లా ప్రజలు మంగళవారం ఉత్కంఠగా ఎదురు చూసారు. విభజన సక్రమంగా జరగలేదని స్వయంగా మోడీనే అన్నందున ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. తెలంగాణాకు తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కేసీఆర్ పోలవరంపై మంగళవారం స్పందించారు. నీళ్లు తీసుకెళ్లండిగానీ ముంపును తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు డిజైన్ మార్చి ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కాకుండా తెలంగాణాలోనే ఉంచాలన్నారు. సరిహద్దుల మార్పులపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గతంలో ఆగిన ఆర్డినెన్స్ హడావుడిగా వస్తుందని ప్రచారం సాగిన నేపథ్యంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ ఈ ప్రాంతం మెడపై ఆర్డినెన్స్ రూపంలో కత్తి వేలాడుతూనే ఉందన్నది నిజం అయ్యింది. గత ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ రాష్ట్రపతి ఆమోదం పొందకపోవడంతో, పార్లమెంటులో నెగ్గిన రాష్ట్ర విభజన బిల్లులో అంశాల ఆధారంగానే ఉన్నతాధికారులు జిల్లా నుంచి విడిపోతున్న ప్రాంతాలను పరిగణనలోకి తీసుకోక తప్పని పరిస్థిసితులేర్పడ్డాయి. పార్లమెంటులో ఆమోదం పొందిన బిల్లు ప్రకారం చూస్తే, పోలవరం ముంపు ప్రాంతాలుగా గుర్తించిన 137 గ్రామాలే ఆంధప్రదేశ్‌లో కలుస్తాయి. ఆర్డినెన్స్ జారీ కోసం కేంద్ర మంత్రివర్గం రాష్ట్రపతికి సిఫార్సు చేసిన అంశాలను చూస్తే చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు పూర్తిగా, భద్రాచలం పట్టణం మినహా ఆ మండలంలో మిగిలిన గ్రామాలతోపాటు, బూర్గంపాడు మండలంలోని 6 గ్రామాలు ఆంధప్రదేశ్‌లో కలుస్తాయి. విభజన అమలులోకి వస్తున్న అపాయింటెడ్ డే’ జూన్ 2వ తేదీ కంటే ముందే విభజనలోని పక్రియలను పూర్తి చేయాలనే ప్రయత్నంలో ప్రస్తుత ఉన్నతాధికారుల విభజన ప్రత్యేక బృందం కసరత్తు చేస్తోంది. జూన్ 2వ తేదీకి ముందుగానే విభజనలో భాగంగా జిల్లాలోని భద్రాచలం, పాల్వంచ రెవెన్యూ డివిజన్లలో ప్రత్యేకంగా మండలాలు, గ్రామాల వారీగా లెక్కలు పూర్తి చేయాల్సి ఉంది. దీనిలో భాగంగా భూభాగం, ప్రభుత్వోద్యోగులు, సంస్థలు, ప్రభుత్వ భవనాలు, విద్యాసంస్థలు, వివిధ ప్రభుత్వ విభాగాల వారీగా విభజన పని పూర్తి చేసేందుకు ప్రణాళిక తయారు చేసి, సిద్ధంగా ఉన్నారు. అన్ని ప్రభుత్వ విభాగాల వారీగా విభజన జరగాల్సి ఉండగా, జిల్లాలో నుంచి ఆంధప్రదేశ్‌కు బదలాయించనున్న పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతంపై ఇంకా స్పష్టత లేకపోవడం గందరగోళానికి దారి తీసింది. తాజాగా ఆర్డినెన్స్‌ను సిఫార్సు చేసి, రాష్ట్రపతి ఆమోదం లభించడంతో విభజనపై స్పష్టత వచ్చింది.
కేంద్ర నిర్ణయంపై సీపీఎం మండిపాటు
ఇదిలావుంటే దీనిపై సిపిఎంతో పాటు అఖిలపక్ష నేతలు మండిపడుతున్నారు. కేంద్ర నిర్ణయాన్ని తప్పుపట్టారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చి ముంపును తగ్గించాలని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. ముంపు ప్రాంతాన్ని సీమాంధ్రలో కలపాలన్న ఆలోచనలు విరమించి తెలంగాణాలోనే కొనసాగించాలని పేర్కొన్నారు. అన్ని వర్గాలను, పార్టీలను, సంఘాలను, సంస్థలను కలుపుకొని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. ఇందుకోసం 29నుంచి స్థానిక అంబేద్కర్ సెంటర్‌లో నిరవధిక దీక్షలు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు టిఆర్‌ఎస్ 29న బంద్‌కు పిలుపునివ్వగా అంతకు ముందే 30న అఖిలపక్ష నేతలు బంద్‌కు పిలుపునిచ్చారు.
యూపీఏ తప్పిదాలకు మన్యం వాసులు బలి
రాష్ట్ర విభజనలో గత యూపీఏ ప్రభుత్వం చేసిన తప్పిదాలకు మన్యం వాసులు బలవ్వాల్సి వస్తుంది. ఒకే రాష్ట్రంలో కలిసికట్టుగా జీవిస్తున్న గిరిజనం రెండుగా విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జీవో నెం.111 ప్రకారం పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలుపుతూ రాష్ట్ర విభజన చేయడంతో మన్యం ప్రజానీకం ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. జిల్లాలో పాల్వంచ, భద్రాచలం రెవెన్యూ డివిజన్లలోని 207 గ్రామాలు సీమాంధ్రలో కలిశాయి. అయితే కొన్ని మండలాలు రెండుగా చీలిపోయి కొన్ని గ్రామాలు తెలంగాణ, కొన్ని గ్రామాలు ఆంధప్రదేశ్‌లో ఉండిపోయాయి. ప్రజానీకం తెలం గాణలో కార్యాలయాలకు వెళ్లాలంటే ఆంధప్రదేశ్ విూదుగా వెళ్లాల్సిందే. అక్కడి కార్యాలయాల్లో పనుల కోసం వెళ్లాలంటే తెలంగాణ దాటాల్సిందే. ఇందులో చింతూరు మండలం మూడు ముక్కలుగా విడి పోయింది. రెండు ముక్కలు తెలంగాణ, ఒక ముక్క ఆంధప్రదేశ్. తాజాగా తెలంగాణ గ్రామాలకు ఎర్రంపేటను కేంద్రంగా ఖరారు చేశారు. దీంతో భద్రాచలం, సింగన్నగూడెం మధ్యనున్న తెలంగాణ వాసులు ఎర్రంపేటలోని మండల కేంద్రానికి రావాలంటే మధ్యలో ఉన్న 13 కిలోమీటర్ల ఆంధప్ర దేశ్‌ను దాటుకుంటూ రావాల్సిందే. అలాగే సీమాంధ్ర గ్రామాలవాసులు వారి కార్యాలయాలకు వెళ్లా లంటే ఎర్రంపేట నుంచి తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు వరకు ఉన్న 30 కిలోవిూటర్ల తెలంగాణ రహదారిని దాటుకుంటూ వెళ్లాల్సిందే. కూనవరం, వీఆర్ పురం మండలాల్లోని తెలంగాణ గ్రామాలకు ఎర్రంపేట కేంద్రంగా విలీనం చేశారు. ఇక్కడ నుంచి మండల కార్యాలయాలకు రావాలంటే సీమాం ధ్రలోని 30 కిలోమీటర్లు దాటుకుంటూ రావాలి. తెలంగాణ డిపోల నుంచి వచ్చే బస్సు సర్వీసులు చింతూరు మండలంలోని సింగన్నగూడెం నుంచి చిడుమూరు, చింతూరు వరకు ఉన్న ఆంధప్రదేశ్ రహదారిపై వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాల ఆర్టీసీ సర్వీసులు నడవాలంటే రూట్ పర్మిట్లు పొందాలి. అంతేకాకుండా విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి డిపోల నుంచి భద్రాచలానికి నడిచే బస్సు సర్వీసులు దాదాపు 60 కిలోమీటర్ల తెలంగాణ రహదారిపై వెళ్లాల్సి ఉంది. దీని ద్వారా ఇరు రాష్ట్రాలకు ట్యాక్స్‌ల భారం పడే అవకాశం కనపడుతుంది.