స్తంభించిన తెలంగాణ

band
పోలవరాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర బంద్‌ సక్సెస్‌
కదలని బస్సులు, మూతబడ్డ విద్యా, వాణిజ్య సంస్థలు శ్రీపది జిల్లాల్లో ఆర్డినెన్స్‌ను నిరసిస్తూ నినదించిన జనం
హైదరాబాద్‌, మే 29 (జనంసాక్షి) :
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపునకు గురయ్యే ఖమ్మం జిల్లాలోని ఏ డు మండలాలను సీమాంధ్రలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ ఇ చ్చిన బంద్‌ పిలుపుతో తెలంగాణ స్తంభించింది. హైదరాబాద్‌ సహా పది జిల్లా ల్లో బంద్‌ ప్రభావం స్పష్టంగా కనిపించింది. పల్లెలు, పట్టణాలు సహా ప్రధాన నగరాల్లో జనజీవనం స్తంభించింది. బస్సుల రాకపోకలు పూర్తిగా నిలి చిపోయాయి. వ్యాపార లావాదేవీలు స్తంభించాయి. పోలవరం ముంపు గ్రా మాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేయ డాన్ని నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ గురువారం బంద్‌కు పిలు పునిచ్చారు. బంద్‌కు తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ, ఇతర సంఘాలు మద్దతు ప్రకటించడంతో మంచి స్పందన లభించింది. గురువారం ఉ దయం నుంచే టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కారు. నిరసనలు, ఆందోళనలు, రాస్తారోకోలు చేపట్టారు. డిపోల ఎ దుట బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఫలితంగా ఆర్టీసీ సుమారుగా రూ.10 కోట్ల మేర ఆదాయానికి గండి పడింది. ర వాణా సౌకర్యాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు తెరుచుకోలేదు. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. ఇంటర్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి.

విధుల బహిష్కరణ..

పోలవరంపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సచివాలయ తె లంగాణ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. మోడీ సర్కారుకు వ్యతిరేకంగా సచివాలయంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనం తరం సి-బ్లాక్‌ ఎదుట బైఠాయించారు. ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్‌ను ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అటు అసెంబ్లీ ఉద్యోగులు కూడా విధులకు దూరంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒంటెత్తు పోకడలు పోవడాన్ని నిరసిస్తూ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. న్యాయవాదుల జేఏసీ ఆధ్వ ర్యంలో పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు. ఎన్డీయే సర్కారు దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్రం జారీ చేసిన పోలవరం ముంపు గ్రామాల విలీనం ఆర్డినె న్స్‌ను వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మికులు ఎన్డీయే ప్రభుత్వ దిష్టిబొమ్మను దహ నం చేశారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మి కులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.

జిల్లాల్లో బంద్‌

హైదరాబాద్‌లో బంద్‌ ప్రభావం బాగా కనిపించింది. ఎంజీబీఎస్‌ నుంచి వివి ధ ప్రాంతాలకు వెళ్లాల్సిన మూడు వేల బస్సులు నిలిచిపోయాయి. జిల్లా లకు పరిమిత సంఖ్యలో బస్సులు నడవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బం ది పడ్డారు. సిటీ బస్సు సర్వీసులకు కూడా తీవ్ర

అంతరాయం కలిగింది. ఎంజీబీఎస్‌, జూబ్లీ బస్టాండ్‌ సహా నగర వ్యాప్తంగా ఉన్న డిపోల వద్ద టీఆర్‌ఎస్‌ నేతలు ఆందోళనలు నిర్వహించారు. సికింద్రాబాద్‌ జూబ్లీ బస్టాండ్‌ ఎదుట ఈటెల రాజేందర్‌, కనకారెడ్డి ఆందోళన చేపట్టారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. రాజేంద్రనగర్‌, ఉప్పల్‌, మేడ్చల్‌ తదితర డిపోల నుంచి బస్సులు బయటకు రాలేదు. ఎంఎంటీఎస్‌తో పాటు రైళ్లు యథతథంగా నడిచాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పటు చేశారు. పారామిలిటరీ బలగాలను మోహరించారు. రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో బంద్‌ విజయవంతమైంది. సంగారెడ్డి డిపో ఎదుట టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ నేతృత్వంలో నేతలు బైఠాయించారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. పోలవరం డిజైన్‌ మార్చాల్సిందేనని వారు డిమాండ్‌ చేశారు. మెదక్‌ జిల్లా వ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి. అన్ని మండల కేంద్రాల్లో తెలంగాణ వాదులు ఆందోళనలు నిర్వహించారు. రోడ్లపై  బైఠాయించారు. గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ డిపో నుంచి బస్సులు బయటకు రాలేదు. సిద్దిపేటలో బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. దుకాణాలను మూసివేయించారు.  మహబూబ్‌నగర్‌ జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. బంద్‌ సందర్భంగా 8 డిపోల్లోని 859 బస్సులు నిలిచిపోయాయి. కల్వకుర్తి, గద్వాల్‌, ఆలంపూర్‌ తదితర డిపోల ఎదుట టీఆర్‌ఎస్‌ శ్రేణులు బైఠాయించాయి. జిల్లా వ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. వరంగల్‌ జిల్లాలో బంద్‌ విజయవంతమైంది. బస్సులు బయటకు రాకుండా ఉదయం నుంచే టీఆర్‌ఎస్‌, జేఏసీ నేతలు డిపోల ఎదుట బైఠాయించారు. నల్లగొండ జిల్లాలోనూ బంద్‌ ప్రభావం బాగా కనిపించింది. ఆర్టీసీ డిపోల ఎదుట నేతలు ఆందోళనకు దిగారు. దీంతో బస్సులు డిపో దాటి బయటకు రాలేదు. జిల్లా వ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలను స్వచ్ఛందంగా మూసివేసి, బంద్‌లో పాల్గొన్నాయి. ఆదిలాబాద్‌లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలోని అన్ని డిపోల ఎదుట బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఆరు డిపోల్లోని 600 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. దీంతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. పెట్రోల్‌ బంకులు మూతబడ్డాయి. సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. నిజామాబాద్‌ జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగింది. ఆరు డిపోల్లోని 800 బస్సులు రోడ్డెక్కలేదు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ ఎదుట టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గణెళిశ్‌ గుప్తా, పోచారం శ్రీనివాసరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఆర్డినెన్స్‌ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌, ఆర్మూర్‌, కామారెడ్డి, బాన్సువాడ బస్టాండ్ల ఎదుట టీఆర్‌ఎస్‌, జేఏసీ నేతలు ఆందోళనకు దిగారు.  కరీంనగర్‌ జిల్లాలో మంచి ప్రభావం కనిపించింది. జిల్లా వ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి. హుజూరాబాద్‌ ఆర్టీసీ డిపో ఎదుట తెలంగాణ వాదులు బైఠాయించారు. ఖమ్మం బస్‌ డిపో ఎదుట తెల్లవారుజాము నుంచే తెలంగాణ వాదులు బైఠాయించారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఖమ్మం బస్‌ డిపో ఎదుట టీఆర్‌ఎస్‌, సీపీఐ, సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు.