మంత్రి వర్గంపై చంద్రబాబు తుది కసరత్తు
హైదరాబాద్, జూన్ 7 : ఏపీ ముఖ్యమంత్రిగా రేపు(ఆదివారం) సాయంత్రం ప్రమాణం స్వీకారం చేయనున్నటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంత్రి వర్గ కూర్పుపై బిజీబిజీగా ఉన్నారు. తనతో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల వివరాలు రేపు ఉదయానికల్లా గవర్నర్‌కు ఇవ్వనున్న తరుణంలో మంత్రి వర్గ కూర్పుపై బాబు దృష్టి సారించారు. ఇప్పటికే పలువురు నేతలు పేర్లను ఖరారుచేసినట్లు తెలుస్తోంది. మొదటి విడుతలో భాగంగా చంద్రబాబుతో పాటు 17 మందిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలి విడతలో పార్టీ సీనియర్ నేత కర్నూలు జిల్లాకు చెందిన కేఈ కృష్ణమూర్తి పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం రేసులో కూడా కేఈ కృష్ణమూర్తి ఉన్నారు.
మంత్రులుగా ఖరారైన వారి పేర్లు :
* కర్నూలు – కేఈ కృష్ణమూర్తి
* అనంతపురం – కాల్వ శ్రీనివాసులు, పరిటా సునీత
* చిత్తూరు – బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, శంకర్‌యాదవ్
* ప్రకాశం – శిద్దా రాఘవరావు
* గుంటూరు – పత్తిపాటి పుల్లారావు
* కృష్ణా – దేవినేని ఉమా, మండలి బుద్ధప్రసాద్
* పగో – చింతమనేని ప్రభాకర్, పీతల సుజాత
* తూగో – నిమ్మకాయల చినరాజప్పకు మంత్రి పదవులు ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.