చేపమందుకు భారీ స్పందన

fish

హైదరాబాద్‌, జూన్‌ 8
(జనంసాక్షి) :
మృగశిర కార్తె సందర్భంగా అస్తమా రోగులకు బత్తిన సోదరులు వేసే చేపమందుకు భారీ స్పందన లభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు.
ఆదివారం సాయంత్రం బత్తిన హరినాథ్‌గౌడ్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు రెండు వేల మంది పోలీసులతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రోగులకు వేసేందుకోసం లక్ష చేప పిల్లలను సిద్ధంగా ఉంచా రు. సుమారు మూడు టన్నుల చేపమందును బత్తిన సోదరులు సిద్ధం చేశారు. సోమవారం సాయంత్రం వరకు చేపమందు పంపిణీ చేస్తామని బత్తిన సోదరులు తెలిపారు. అయితే భారీగా తరలివచ్చిన రోగులకు అనుగుణంగా ఏర్పాట్లు చేయలేదని, క్యూలైన్లలో తోసివేతల వల్ల పలువురు రోగులు అస్వస్థతకు గురయ్యారని బంధువుల ఆందోళన వ్యక్తం చేశారు.