సీఎం కాన్వాయ్‌కి టీఎస్‌ సిరీస్‌

car
హైదరాబాద్‌, జూన్‌ 14 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్రంలో వాహనాల నంబర్‌ ప్లేట్ల మార్పునకు రవాణా శాఖ శ్రీకారం చుట్టింది. శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వాహన కాన్వాయ్‌కు ఉన్న నంబర్లను మార్చింది. ఆంధ్రప్రదేశ్‌ సీఎం ఉపయోగించిన ఏపీ స్థానంలో టీఎస్‌ను చేర్చింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో వాహనాల నంబర్‌ ప్లేట్లపై ఏపీ స్థానంలో టీఎస్‌తో పాటు జిల్లా కోడ్‌ను మార్చుకుంటే సరిపోతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. మొదట తెలంగాణ రాష్ట్ర సిరీస్‌ను టీజీగా నిర్ణయించాలని అనుకున్నా దానిని టీఎస్‌గా మార్చాలని
కేసీఆర్‌ ఆదేశించారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వాహనాల రిజేస్ట్రేషన్‌ను టీఎస్‌గా చేయాలని నిర్ణయిస్తూ రాజపత్రం జారీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రిజిస్టర్‌ అయ్యే వాహనాలకు టీఎస్‌ కింద నంబర్లను కేటాయిస్తారు.