మన నదులను కాపాడుకుందాం
కేంద్ర మంత్రి ఉమాభారతి
న్యూఢిల్లీ, జూన్ 17 (జనంసాక్షి) :
భారతీయ సనాతన సంప్రదాయానికి ఆలవాలమైన నదులను కాపాడుకుందామని కేంద్ర జలవనరులు, నదుల శాఖ మం త్రి ఉమాభారతి అన్నారు. నదుల రక్షణపై ప్రజలను చైతన్య పరిచే కార్యక్రామానికి, దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్య కామానికి ఆమె మంగళవారం శ్రీకారం చుట్టారు. కేదార్ నాథ్ విషాదంలో జ్ఞాపకార్థం
న్యూఢిల్లీలోని యమునా నది ఒడ్డున ఆమె మొక్కలు నాటారు. పెద్ద సంఖ్యలో చెట్లు పెంచడం వల్ల భూమి కోతకు గురవ్వడం, వరదలు వంటి విపత్తులను ఎదుర్కొనవచ్చని అన్నారు. ఇందులో భాగంగా గంగోత్రి, హరిద్వార్, కాన్పూర్, అలహాబాద్, వారణాసి, పాట్నా, నబాద్వీప్, గంగాసాగర్ వద్ద మొక్కలు నాటడం ప్రారంభించారు.