కరెంట్ ఒప్పందంపై కిరికిరి
ఎక్కడి కరెంట్ అక్కడే అనడం ఒప్పందాల ఉల్లంఘనే
ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష శ్రీ కేంద్రానికి సీఎస్ లేఖ
ఒప్పందాలకు కట్టుబడాల్సిందే శ్రీకేంద్రం స్పష్టీకరణ
మీరు ఒకటి చేస్తే.. మేం పది చేస్తాం… జాగ్రత్త!
మీ అసెంబ్లీకి, మీ మంత్రుల బంగళాలకు కరెంట్ వద్దా?
హరీశ్‌రావు సూటి ప్రశ్న
హైదరాబాద్, జూన్ 18 (జనంసాక్షి) :విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు (పీపీఏ) నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త కిరికిరి మొదలు పెట్టిండు. ఎక్కడ ఉత్పత్తి అయ్యే కరెంట్‌ను అక్కడే వినియోగించుకోవాలంటూ రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టం ఉల్లంఘనకు పాల్పడ్డ ఆంద్ర óప్రదేశ్ ముఖ్యమంత్రిపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహించింది. దొడ్డిదారిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేయడానికి చంద్రబాబు ప్రయత్నించడంపై తెలంగా ణ ప్రభుత్వం వెంటనే స్పందించింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఉన్నతాధికా రులతో సమావేశమయ్యారు. ఏపీ ప్రభుత్వం చర్యలను నిలువరించేందుకు తీసుకోవా ల్సిన చర్యలపై సమీక్షించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ కేంద్రానికి లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం లేఖపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పం దించింది. రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టానికి లోబడే విద్యుత్ పంపిణీ ఉంటుందని, దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలు సరికాదంటూ మొట్టికాయలు వేసింది. మరోవై పు చరద్రబాబు కుట్ర పూరిత నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్, ఇతర రాజకీయ పక్షాలు స్పందించాయి. చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుబట్టాయి.
విద్యుత్ పీపీఏ రద్దు చేయాలన్న ఆంధప్రదేశ్ నిర్ణయం హాస్యాస్పదమని నీటి పారుదల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇది తగదని అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో ఆయన మాట్లా డుతూ పీపీఏల ఆధారంగానే ఇప్పటివరకు టారిఫ్‌లను నిర్ణయించారని పేర్కొన్నారు. విభజన జరిగిన తరవాత ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం తగదన్నారు. విద్యుత్ లోటు ఉన్న విషయం తెలిసీ కూడా నిర్ణయం తీసుకోవడం సమంజసమా అని ప్రశ్నించారు. ఆంధప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం అమలు జరగినివ్వమని హెచ్చరించారు. పీపీఏలు రద్దు చేయాలన్న ఆదేశాన్ని ఆంధప్రదేశ్ ప్రభుత్వం విరమిం చుకోవాలని కోరారు. ఒకవేళ ఏపీ ప్రభుత్వం వినకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఆంధ్రా సీఎం చంద్రబాబు సచివాలయంలో ఉంటే విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుందన్నారు. అలాగే ఇక్కడే అసెంబ్లీ నడుస్తుందని, ఇక్కాడే కార్యాలయాలు ఉంటాయని అన్నారు. ఇవన్నీ కరెంట్ లేకుండానే నడుస్తాయా అని హరీశ్ ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుని కరెంట్ ఎలా వాడుకుంటారని అన్నారు. పరిశ్రమలు, వ్యవసాయానికి ఎలాంటి ఢోకా లేకుండా తాము చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఉన్నామని చెప్పారు. అయితే ఈ నిర్ణయాలపై
పునరాలోచన చేయాలన్నారు. పీపీఏల రద్దు నిర్ణయం ఏకపక్షమని, హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. దాన్ని అమలు కానివ్వబోమని ప్రకటించారు. విూలా ఏకపక్ష నిర్ణయం తీసుకొంటే.. మీ సీఎం, మం త్రుల ఇళ్లు, సచివాలయం, కార్యాలయాలు ఎలా ఉంటాయో ఊహించుకోండని హెచ్చరించారు. పదేళ్ల పాటు ఉమ్మడిగా వర్తించే విషయాలను ఉల్లంఘించడం అనైతికమన్నారు. పీపీఏల ఆధారంగానే ఇప్ప టివరకూక టారిఫ్‌లను నిర్ణయించారని గుర్తు చేసిన ఆయన.. విద్యుత్ లోటు ఉన్న విషయం తెలిసి కూడా ఈ నిర్ణయం తీసుకోవడం సమంజసమా? అని ప్రశ్నించారు. పీపీఏల రద్దుతో 600 మెగావాట్ల విద్యుత్ లోటు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ నియంత్రణ సంస్థకు రాసిన లేఖను చంద్రబాబు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమన్యాయం అని ఊదరగొట్టే చంద్రబాబు.. ఇప్పుడు ఒక ప్రాంతానికి అన్యాయం చేసేలా ఎలా వ్యవహరిస్తామని ప్రశ్నించారు. తెలు గు ప్రజల సెంటిమెంట్ పేరు చెప్పే విూరు ఇలా ఎలా రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకుంటారో చెప్పాలని ఏపీ సర్కారును నిలదీశారు. తెలంగాణలో ఉన్న వాల్లు తెలుగు ప్రజలు కాదా? కరెంట్ లోటు ఉందని తెలిసి కూడా ఇలా వ్యవహరిస్తారా? అని అడిగారు. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిలో ఉంటారని.. అప్పుడు విూకు విద్యుత్ అవసరం లేదా? అని ప్రశ్నించారు. విూరు ఒకటి చేస్తే తాము చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. విూలా ఏకపక్ష నిర్ణయం తీసుకొంటే.. విూ సీఎం, మంత్రుల ఇళ్లు, కార్యా లయాలు ఎలా పని చేస్తాయో గుర్తు చేసుకోవాలన్నారు. విూ అసెంబ్లీకి, సచివాలయం, మంత్రుల ఇళ్లకు విద్యుత్ అవసరం లేదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో మీ కార్యాలయాలు విద్యుత్ లేకుం డా ఎలా నడుస్తాయని నిలదీశారు. తమ రైతులకు, పారిశ్రామికవేత్తలకు విద్యుత్ ఎలా ఇవ్వాలో తమ కు తెలుసన్నారు. పునర్విభజన చట్టంలో ఉన్నదే అమలు చేయాలని అడుగుతున్నామని అంతే తప్ప తమకు ఎక్కువ విద్యుత్ కేటాయించాలని కోరడం లేదని చెప్పారు. ఏపీ సర్కారు నిర్ణయంపై ముఖ్య మంత్రి కేసీఆర్ సవిూక్ష నిర్వహించారని హరీశ్‌రావు తెలిపారు. ప్రత్యామ్నయ ఏర్పాట్లపై తెలంగాణ సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. తెలంగాణ ప్రజలు, రైతులు, పారిశ్రామిక వేత్తలు భయపడాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు.