మనందరికీ దారి చూపిన మహోపాధ్యాయుడు
తెలంగాణాలోనే కాదు ఆంధ్రలో మనవాదాన్ని వినిపించిన ధీరుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్
సార్ దారిలో తెలంగాణ
కొత్త రాష్ట్రంలో ఆయన లేకపోవడం బాధాకరం
కొత్త జిల్లాకు ఆయన పేరే : ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, జూన్ 21 (జనంసాక్షి) :ప్రొఫెసర్ జయశంకర్ సార్ మనందరికీ దారి చూపిన మహోపాధ్యాయుడని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌రావు అన్నారు. శనివారం నగరంలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన జయశంకర్ సార్ మూడో వర్ధంతి వేడుకలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంత కుముందు భవన్‌లోని జయశంకర్‌సార్ విగ్రహానికి ఆయన సహా మంత్రులు, ఎంపీలు, ముఖ్య నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వర్ధంతి సందర్భంగా తెలంగాణ అంతటా తెలంగాణ జాతి పిత ఆచార్య జయశంకర్ సార్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. స్వరాష్ట్ర సాధనలో ఆయన సలిపిన పోరును సగర్వంగా స్మరించుకునారు. తెలంగాణ వ్యాప్తంగా ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగా ణభవన్‌లో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ, జయ శంకర్ సార్ పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొనే పద మూడేళ్లు తెలంగాణ కోసం ఉద్యమాన్ని నడిపించానన్నారు. విద్యార్థి దశ నుంచి కన్నుమూసే వరకూ తెలంగాణ కోసం జయశంకర్ సార్ పోరాడారని ప్రశంసిం చారు. కాల గమనంలో కొందరు చరిత్రకు శ్రీకారం చుడతారని అలాంటి వారిలో సార్ ఒకరని కొనియాడారు. ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నామని, వాటన్నింటిని ఆయన సలహాలు, సూచనలతోనే అధిగమించానన్నారు.
జయశంకర్ సార్‌తో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసు కున్నారు. ఎప్పుడూ తెలంగాణ సాధన గురించే చర్చించేవాళ్లమన్నారు. ఏది ఏమై నా తెలంగాణ ఏర్పాడాలి.. ప్రజలు సుఖపడాలని ఆయన కోరుకొనే వారన్నారు. నమ్మని సిద్ధాంతం కోసం చివరకు పోరాడారని కొనియాడారు. తెలంగాణ ప్రజలు ఇంకెన్నాళ్లు వెనుకబాటుతనాన్ని భరించాలని ఎప్పుడూ ఆవేదన చెందేవారని తెలిపారు. తెలంగాణ ప్రజలు స్వతంత్రంగా బతకాలని కోరుకున్నారని చెప్పారు. ఉద్యమానికి నేతృత్వం వహిస్తానని 1996లో శ్రీరాంసాగర్ జలాశయం కట్టపై జయశంకర్‌తో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ వెల్లడించారు. తనకు తెలియని ఎన్నో విషయాలను ఆయన చెప్పారన్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా సార్ మాత్రం తెలంగాణ ఉద్యమాన్ని వీడలేదని గుర్తు చేశారు. అయితే, తెలం గాణ వచ్చిన సమయంలో సార్ మన మధ్య లేకపోవడం దురదృష్టకరమన్నారు. అన్యాయం, దోపిడీ, అణచివేత ఎక్కడైతే మితిమీరుతదో అక్కడ తిరుగుబాటు వస్త దన్నారు. అలా వచ్చిందే తెలంగాణ ఉద్యమమని చెప్పారు. ఉద్యమ సందర్భంగా ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొన్నామని కేసీఆర్ గుర్తు చేశారు. ఆంధ్ర పాలనలో తెలంగాణ అస్థిత్వం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో విలీనమయ్యే సమయంలోనే జయశంకర్ సార్ వ్యతిరేకించారన్నారు. అప్పటి నుంచి చనిపోయే వరకూ ఆయన తెలంగాణ సాధన
కోసమే ఉద్యమించారన్నారు. ఎన్నిసార్లు అణచివేసినా జయశంకర్ సార్ ఉద్యమాన్ని ఆపలేదని గుర్తు చేశారు. జయశంకర్ తెలంగాణ మహామ¬పాధ్యాయుడని కేసీఆర్ అభివర్ణించారు. పార్ చెప్పిన విషయాలో నాలో స్ఫూర్తినిచ్చాయన్నారు. బడ్జెట్ విడుదలయినప్పుడల్లా తెలంగాణకు ఎంత మేరకు కేటాయింపులు జరిగాయో పరిశీలించే వారని, అందులో తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి తనతో చర్చించే వారన్నారు. నడిసంద్రంలో నావలాగా ఉన్న ఉద్యమాన్ని కడదాకా పట్టుకొచ్చిన యోధుడు ఆయన అని కొనియాడారు. ఒక సిద్ధాంతాన్ని నమ్మితే ఎంత పట్టుదలతో ఉండాలనే దానికి ఆయనే నిదర్శమన్నారు. తాను పాత కేసీఆర్‌నేనని, సీఎం కాగానే తనకు కొమ్ములేవిూ పొడుచుకుని రాలేదని ఆయన అన్నారు. తెలంగాన కోసం తనతో కలసి పోరాటంలో పాల్గొన్న వారందరికీ న్యాయం చేస్తానని అన్నారు. సచివాలయంలో అధికారులు, కొత్తకొత్తవారు కనిపిస్తున్నారని, ఇక్కడ మాత్రం తనతో కలసి పోరాడిన వారు కనిపిస్తున్నారని అన్నారు. బంగారు తెలంగాణ సాధనకు కట్టుబడి ఉన్నామని, అందుకు అందరినీ కలుపుకుని ముందుకు వెళతానన్నారు. నాకు మంత్రి పదవి రాకనే టీఆర్‌ఎస్ పార్టీ పెట్టారని పలువురు ఆరోపించారని, ఇంకా ఆరోపిస్తున్నారని ఆ ఆరోపణలు కాలం చెల్లిన మెడిసిన్ లాంటిదని వ్యాఖ్యానించారు. తాను ముఖ్యమంత్రి అయినా పాత కేసీఆర్నే అని తనకు ఏ కొమ్ములు రాలేదన్నారు. సచివాలయంలో కొత్తవారు. పార్టీ ఆఫీసుల్లో పాతవారు కనిపిస్తున్నారని చెప్పారు. పార్టీ కోసం పని చేసిన వారందరికీ పదవులు ఇస్తామని చెప్పారు. త్వరలో పార్టీ కార్యక్రమాలను భారీ ఎత్తున్న నిర్వహిస్తామని అందుకోసం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు వచ్చింది ఇడ్లీ సాంబార్, రికార్డింగ్ డాన్సులే అంటు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. చిన్ననాటి నుంచి తెలంగాణ కోసం పోరాటం చేసిన మహామనిషి ప్రొ.జయశంకర్ అని తెలంగాణ కేసీఆర్ తెలిపారు. 2001 నాటికి ముందు నుంచే తెలంగాణ ఉద్యమం కోసం కసరత్తు చేసినట్లు కేసీఆర్ వివరించారు. ప్రొ.జయశంకర్ సార్ స్ఫూర్తితోనే ఉద్యమాన్ని నడిపినట్లు ఆయన ఈ సందర్భంగా విశదీకరించారు. జయశంకర్ సార్ పేరిట హైదరాబాద్ నగరంలో మెమోరియల్తోపాటు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాకు జయశంకర్ పేరు పెడతామని వెల్లడించారు. వర్ధంతి సభలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలతో పాటు భారీగా ఆ పార్టీ కార్యకర్తులు పాల్గొన్నారు.