పునర్నిర్మాణం కోసమే పునరేకీకరణ

kcr

స్వలాభం కోసం కాదు.. స్వరాష్ట్రం కోసమే

ముఖ్యమంత్రి కేసీఆర్‌

టీఆర్‌ఎస్‌లోకి విపక్ష ఎమ్మెల్సీలు

హైదరాబాద్‌, జూన్‌25 (జనంసాక్షి):

పునర్నిర్మాణం పునరేకీకరణ   స్వలాభం కోసం కాదని, స్వరా ష్ట్రం కోసమే నని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పారు. ప్రస్తుతం ఏర్పడ్డ తెలంగాణ బంగారు తెలంగాణగా మార్చ డమే తమ ధ్యేయమన్నారు. పార్టీలో చేరుతున్న నాయ కుల కలయిక కూడా అభివృద్ధి కోసమేనని పేర్కొన్నారు. బుద óవారం తెలంగాణ భవన్‌లో విపక్షానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సంద ర్భంగా  కేసీఆర్‌ మాట్లాడుతూ ఈ నాయకుల చేరికలు రాజ కీయాల కోసం, పదవుల కోసమో కాదని రాష్ట్ర ప్రగతి కోస మని వ్యాఖ్యానించారు. వచ్చిన తెలంగాణను ఏ విధంగా అభి వృద్ధి చేసుకోవాలనే దానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేరికనే నిదర్శనమన్నారు. ఇదే ఐక్యత తెలంగాణ సమాజంలో కొన సాగాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ నేతలు కూడా ఆలోచించుకోవాలని, తెలంగాణ ద్రోహుల పార్టీని వీడి రావాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా ఆంధ్రా నేతలు ఇంకా దురహంకారంతో మాట్లాడుతున్నారని విమ ర్శించారు. ఇప్పటికీ కృష్ణా జలాలను తరలించేందుకు ప్రయ త్నించారని దుయ్యబట్టారు. సీమాంధ్ర నేతలు నాగార్జు నసాగర్‌ను పొరంబోకు ప్రాజెక్టుగా వాడుకున్నారని మండిప డ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం

చరిత్ర అన్న కేసీఆర్‌ ఆంధప్రదేశ్‌ సీఎం తన నిజరూపాన్ని చూపుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు మానని గాయమని గవర్నర్‌ నోటితో చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలను కలుపుకొనే ఆర్డినెన్స్‌ బాబు దొడ్డిదారిన సాధించారని, కృష్ణానది నీళ్లను గతంలో మాదిరిగానే తరలించేందుకు ప్రయత్నం చేశారన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి తెలంగాణ ప్రజలకు విద్యుత్‌ ఇవ్వకుండా చూశారన్నారు. తాను ఏది మాట్లాడినా చిలవలు పలవలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయ శక్తులు ఏకమైతేనే బంగారు తెలంగాణ సాధ్యమని కేసీఆర్‌ పేర్కొన్నారు. అంతకుముందు టీఆర్‌ఎస్‌లో చేరిన వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలకు కేసీఆర్‌ ఘన స్వాగతం పలికారు. పార్టీలో చేరిన వారిలో బీఎస్పీ ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్‌రెడ్డి, కోనేరు కోనప్ప, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్‌, టీడీపీ ఎమ్మెల్సీలు డి. సలీం, బి.వెంకటేశ్వర్లు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు కేఆర్‌ అమోస్‌, జగదీశ్వర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, భానుప్రసాద్‌, రాజలింగం, మాజీ ఎమ్మెల్సీలు మోహన్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి టీిఆర్‌ఎస్‌ కార్యాలయానికి వచ్చి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేేరినట్లు స్పష్టం చేశారు.