నవ తెలంగాణ నవ శకానికి నాంది

COVER 8
ఊరు నుంచే ప్రణాళికలు

ఉమ్మడి రాష్ట్రంలో గృహ నిర్మాణంలో రూ.235 కోట్ల అవినీతి

మింగిన సొమ్ము కక్కిస్తాం..

అవినీతి అధికారులను జైలుకు పంపుతాం

ఎన్నికల హామీలకు కట్టుబడ్డాం

సమాలోచనల్లో సీఎం కేసీఆర్‌ వెల్లడి

హైదరాబాద్‌, జూలై 7 (జనంసాక్షి) :

నవ తెలంగాణ రాష్ట్రం నవ శకానికి నాంది పలకాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. కొత్త రాష్ట్రంలో కొత్త పంథాలో ముందుకు సాగాలని, తెలంగాణ కేంద్రబిందువుగా చట్టాలు, వనరుల ఆధారంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం సూచించారు. గ్రామస్థాయిలో ప్రణాళిక రూపొందాలని, అలా రాష్ట్రస్థాయి ప్రణాళికకు రచన జరగాలన్నారు. హైదారబాద్‌ నుంచి కిందిస్థాయిలో ప్రణాళిక వెల్లడం ఆకుండా కింద గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర ప్రణాళిక రూపుదిద్దుకోవాలన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం, అభివృద్ది విషయంలో తాము తొందపడడం లేదని, ప్రణాళికాబద్దంగా అభివృద్ది జరనగాలన్నదే తన లక్ష్యమన్నారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్‌ అభివృద్దికి దోహదపడాలే తప్ప, చెడుపు చేసేవిగా ఉండకూడదని సీఎం ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర నిర్మాణ క్రమంలో నాందీ ప్రస్థావన పలుకుతున్న సందర్భమిది. అనేక పోరాటాలు, ఉద్యమాల తర్వాత తెలంగాణ అవతరించిందని కేసీఆర్‌ తెలిపారు. సమైక్య రాష్ట్రంలో తీసుకొచ్చిన చట్టాలు కొన్ని పనికివస్తాయి… కొన్ని పనికిరావు. కొత్త రాష్ట్రంలో కొత్త పంథాలో పోవాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఎంతో ఆశతో ఉన్నారు. తొందరపాటు నిర్ణయాలు వద్దన్నారు. పునాది ఎంత పటిష్టంగా ఉంటే భవిష్యత్‌ అంత భద్రంగా ఉంటుందన్నారు. పాలసీ కిందనుంచి పైకి తయారుకావాలన్నారు. కొత్త రాష్ట్రంలో చట్టాలు, మార్గదర్శకాలు నూతనంగా రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కొత్త రాష్ట్రంలో సరికొత్త పాలనకు ప్రణాళికలు, చట్టాల రూపకల్పనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ‘నవ తెలంగాణ సమాలోచన’ పేరిట విస్తృతస్థాయి సమావేశాన్ని ఎంసీహెచ్‌ఆర్‌డీలో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేసీఆర్‌ అధికార యంత్రాంగానికి దిశానిర్దేశర చేశారు. తెలంగాణకు పునాది ఎంత పటిష్టంగా ఉంటే అంత అభివృద్ధి సాధ్యమని కేసీఆర్‌ అన్నారు. గతంలో అనుసరించిన పద్ధతులను సమూలంగా మార్చాలని పేర్కొన్నారు. మనకు 8500 మంది సర్పంచులు, 6473 మంది ఎంపీటీసీలున్నారు. జెడ్పీటీసీ, ఎంపీపీలు 441 సభ్యులున్నారని తెలిపారు. 62 మున్సిపాలిటీలు, 6 కార్పోరేషన్లు ఉన్నాయి. 1388 మున్సిపల్‌ వార్డులున్నాయన్నారు. ఇంతకాలం పంచాయితీరాజ్‌ వ్యవస్థ ఆశించిన స్థాయిలో ఎదగలేన్నారు. గత ప్రభుత్వంలో కొన్ని నిర్ణయాలు అరాచకంగా జరిగాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 84 లక్షల కుటుంబాలు ఉంటే జారీ చేసిన రేషన్‌ కార్డులు కోటి 7 లక్షలుగా ఉన్నాయన్నారు. 84 లక్షల కుటుంబాలు ఉంటే 55 లక్షల ఇళ్ల నిర్మాణం జరిగిందన్నారు. 593 గ్రామాల్లో సర్వే చేస్తే రూ. 235 కోట్ల నిధులు దుర్వినియోగం జరిగిందని చెప్పారు. గృహ నిర్మాణ పథకంలో వందల కోట్లరూపాయల నిధులు పక్కదారి పట్టాయి. ఈ పథకంపై లోతుగా విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు బయటపడతాయని చెప్పారు. ఈ అక్రమార్కులను పట్టుకోవాలని, అందులోని అవినీతిని కక్కించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇలాగే పోతే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేప్టటిన గృహనిర్మాణ పథకం దళారుల భోజ్యంగా మారే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటి వరకు జరిగిన అక్రమాలను బయటికి తెస్తామన్నారు. గృహనిర్మాణాల్లో అక్రమాలు చేసినవాళ్లను విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఇప్పుడు నిర్మించబోయే గృహాల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వచ్చే మంత్రి మండలి సమావేశంలో రైతు రుణమాఫీ వందశాతం అమలు చేస్తామని, దీనిపై అధికారిక నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఒక్క నెలలోనే అంతా జరిగిపోదు. కొత్త ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి కొంత సమయం పడుతుంది. సుదీర్ఘ ఉపన్యాసాలకు ఇది వేదిక కాదు. పరస్పర సలహాలు, సూచనలు, ప్రణాళికలతో ముందుకు పోదామన్నారు. ఈ నెలనే కాదు వచ్చే నెలలో కూడా ఏమీ జరగదన్నారు. తమవద్ద మంత్రదండం ఏదీ లేదని కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వం నిలదొక్కుకుని ముందుకు సాగాల్సిన తరుణంలో కొందరు ఇలాంటి ప్రకటనలు చేయడం ఏవిూ చేయలేదని, వార్తా వ్యాఖ్యానాలు చేయడం దుర్మార్గమన్నారు. గ్రామస్థాయి నుంచి ప్రజాప్రతినిధులందరికీ త్వరలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. నాలుగు జిల్లాలకో బ్యాచ్‌గా శిక్షణ తరగతులుంటాయని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కలిసి అపార్ట్‌ను సందర్శిస్తామన్నారు. త్వరలోనే అపార్ట్‌ పేరుతో ఉన్న సంస్థ పేరు మార్చుతామన్నారు. ఓరియెంటేషన్‌ ట్రైనింగ్‌ మంచి లాభాలను చేకూరుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కొన్ని కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో  తెలంగాణ ఇమడలేపోయింది. ఇది పూర్తిగా కొత్త రాష్ట్రం. చట్టాలన్నీ ఆంధ్రప్రదేశ్‌ చట్టాలు .కొంతమేరకు పనికి రావచ్చు రాకపోవచ్చు. అన్ని చట్టాలను తిరస్కరించలేం. అలాగని ఆమోదించలేం. తెలంగాణ రీ ఒరియండె స్టేట్‌ కావాలి. తెలంగాణ కళ్లతో వాస్తవాలు చూడాలి. తెలంగాణకు ప్రణాలిక రావాలి. కోత్త రాష్ట్రంలో కొత్త ఆశలు ఉన్నాయి. ప్రజలు ఆశగా ఉన్నారు. కొత్తగా చట్టాలు రూపుదిద్దాల్సి ఉంది. ఆకళింపు చేసుకోవడానికి నెలరోజులుగా వాస్తవంగా అధ్యయనం చేస్తున్నాం. కొత్త పాలసీలు ప్రకటించలేదు. పునాది గట్టిగా ఉంటే భవిష్యత్‌ గట్టిగా ఉంటుంది. లేకుంటే భవిష్యత దెబ్బతింటుంది. హైదరాబాద్‌ నుంచి పోవడం కాదు. పాలసీ కిందినుంచి హైదరాబాద్‌కు రావాలన్నారు. చట్టాల రూపకల్పనలో, ప్రణాళిక రూపొందించడంలో ప్రజలు, ప్రజాప్రతనిధులను భాగస్వాములను చేయాలన్నారు.  కొన్ని విషయాలు అరాచయకంగా ఉన్నాయి, 84 లక్షలు కుటంబాలకు 91 లక్షలు తెల్ల రేషన్‌ కార్డులు జారీ అయ్యాయని, అంత్యోదయ కార్డులు పోనూ 15 లక్షలు గులాబీ కార్డులు కూడా ఉన్నాయన్నారు. వీటికింది బియ్యం ఇతర సరుకులు పక్కదారి పడుతున్నాయని అన్నారు. 22 లక్షలు అదనంగా ఉన్నాయి. ఇవి ఎక్కడ ఉన్నాయి. వీటి బియ్యం, సరకుఉ ఎక్కడ పోతున్నాయి. దీన్ని అంతా సీరియస్‌గా సర్వే చేయాలి. ఇంత అరాచకం సరికాదు. చాచాలాచాలా బాధారకరం. అని సిఎం కెసిఆర్‌ అన్నారు. గృహ నిర్మాణంలో ఇప్పుడు జరుగుతున్న అవినీతి కొనసాగితే, నిధుల దుర్వినియోగం అవుతుంది. ఈ అక్రమాలను వెలుగులోకి తీసుకోవాలి. కలెక్టర్లు ఇలాంటి  అక్రమాలను బయటకు తీసుకుని రావాలి. వారిని జైలుకు పంపాలి. గతంలో అక్రమాలు చేసిన వారు నోళ్లు తెరుచుకోని ఉన్నారు. ఒక్క రూపాయి దుర్వినియోగం జరిగినా చర్య తీసుకోవాలి. కలెక్టర్లు కఠినంగా వ్యవహరించి అక్రమాలు బయటపెట్టాలన్నారు. ప్రజాప్రతినిధులుకు ఎన్‌ఐఆర్డీ, బ్రహ్మకుమారీస్‌ క్యాంపస్‌లో శిక్షణ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.  సర్పంచులు తదితరలుకు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. మూడు రోజుల్లో శిక్షణ ఇవ్వాలి. కొత్త ప్రతినిధుల్లో చాలామంది యువత ఉన్నారు. వారిలో అభివృద్ది తపన ఉంది. వారిని గాలికి వదిలేస్తే చెడగొట్ట బడతారు. అలాంటి వారికి నాలుగు ఐదు జిల్లాలు కలసి శిక్షణ ఏర్పాటు చేయాలి. పంచాయతీరాజ్‌ మూవ్‌మెంట్‌. కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ ఇప్పుడు చంపపడింది. పంచాయితీ రాజ్‌ మూవ్‌మెంట్‌ పునరుజ్జీవింపచేయాలి. దానిని గ్రామస్థాయి అభివృద్ది జరుగుతందన్నారు. ఎస్‌కేడే పుణ్యమా అని రూపుదిద్దుకున్న కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ దెబ్బతిందన్నారు. నెహ్రూ ఆనాడు దీనికి డే సహకారంతో రూపు దిద్దారని, అది మనరాజేంద్రనగర్‌ ఎన్‌ఐఆర్డీ నుంచి ప్రారంభం అయ్యిందన్నారు. ఎస్‌కెేడే వచ్చాక ప్రధాని నెహ్రూ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారన్నారు. పారిశ్రామిక విధానం గురించి మాట్లాడుతూ దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య పోటీ ఉంది. యువతకు ఉద్యోగావకాశాలలు ఖజానా పెంచుకోవడం ముఖ్యమన్నారు. దాదాపు  35 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి  అందుబాటులో ఉంది. ఎక్కడయినా పరిశ్రమలు పెట్టుకునే విధంగా ప్రణాళిక రూపొందించాలన్నారు. కేవలం హైదరాబాద్‌పైనే ఒత్తిడి పెంచేలా కాకుండా ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు ఆవల, తరవాత జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు చొరవ తీసుకోవాలన్నారు. 2.20 లక్షల ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. 5 వేల ఎకరాలకు ఏ జిల్లాలో తక్కువ లేదు. వరంగల్‌ జిల్లాలో మాత్రం కేవలం వేయి ఎకరాలకు మించిలేదన్నారు. గజ్వెల్‌ ఎకరాలు 26-30 వేల ఎకరాలు ఉన్నాయి. ఔటర్‌ రింగ్‌ రోడ్డు బయటకు, న్యూ ఎన్నోవేషన్‌ ఆధారంగా, ప్రతి జిల్లాలో పరిశ్రమలు వచ్చేలా చూస్తామన్నారు. ప్రభుత్వం భూమినే ఇస్తామన్నారు.  సంక్షేమం గగురించి మాట్లాడుతూ ఈ శాఖ నావద్దనే ఉంది. దళిత వాడల నుంచి దరిద్రం పారదోలాలి. 3 ఏళ్లలో తరలివేస్తాం. ఎస్సీ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్గా దీనికి నామకరణం చేశామన్నారు.  15.4 శాతం దళిత జనాభా. ఎస్సీ కార్పోరేషన్‌న్‌ బలోపేతం చేస్తాం. మండలానికో అధికారిని నియమిస్తామని కేసీఆర్‌ అన్నారు. ఇక ఇరిగేషన్‌ గురించి మాట్లాడుతూ మంచినీటి సరఫరా ప్రభుత్వ సామాజిక బాధ్యతన్నారు. 10 శాతం అసవరాలకు నీరు ఇవ్వాలి.  మంచినీటి, పారిశ్రామిక, ఇతరాత్రా వ్యవసాయ అవసరాలకు కూడా కలసి ప్రాజెక్టుల రూపొందించాలన్నారు. ఇంటిగ్రేటెడ్‌ అప్రోచ్‌ ఉండాలన్నారు. ఫైనాన్స్‌ అవసరం లేని ప్లాన్‌లు కొన్ని ఉంటాయని, వాటిని తయారు చేయానల్నారు. గ్రామ సభలు పెట్టి విలేజ్‌ ప్లాన్‌ చేయాలి. నీరు, రవాణా,డ్రైనేజీ తదితర అంశాలు ఉండాలి. గ్రామ, మండల, జిల్లా ప్రణాళిక ఆధారంగా స్టేట్‌ ప్లాన్‌ తయారు కావాలి. సంఘటిత శక్తిలో ఉన్న శక్తి చేయాలి. హన్మంతుడి శక్తి జాంబవంతుడికే తెలుసు. ఎక్కడ లోపాలు ఉన్నాయో గుర్తించి ముందుకు సాగాలి. ప్రజలను సంఘటిత శక్తిగా రూపొందించి ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, అధికారులు, కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.