పోలవరం బిల్లును వ్యతిరేకిస్తున్నాం గుత్తా సుఖేందర్‌రెడ్డి


ఢిల్లీ: గిరిజనులకు అన్యాయం చేసేవిధంగా ఉన్న పోలవరం బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం దారుణమన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అభిప్రాయాలు తీసుకోకుండా నిర్ణయం సరికాదన్నారు. పోలవరం డిజైన్‌ మార్చాలని, వెంటనే కేంద్ర ¬ంశాఖ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదన్నారు.