ఆదివాసుల్ని ముంచేశారు
లోక్‌సభ సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ
ముంపు మండలాల బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఇది రాజ్యాంగ విరుద్ధం
ఆర్టికల్ 3 ప్రకారం రెండు రాష్ట్రాల అభిప్రాయం కోరాలి : ఎంపీ వినోద్
ఇది బ్లాక్ డే : గుత్తా సుఖేందర్‌రెడ్డి
ముక్తఖంఠంతో వ్యతిరేకించిన తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ఎంపీలు
మూజువాణి ఓటుతో సభ ఆమోదం
న్యూఢిల్లీ, జూలై 11 (జనంసాక్షి) :
నరేంద్రమోడీ ప్రభుత్వం తన మొదటి చర్యలోనే దేశ మూలవాసులైన ఆదివాసుల్ని ముంచేసింది. లోక్‌సభ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ఎంపీల తీవ్ర నిరసనల మధ్య పోలవరం ముంపు ప్రాంతాలను ఏపీలో విలీనానికి సంబంధించిన బిల్లును లోక్‌సభ శుక్రవారం ఆమోదించింది. దీంతో భద్రాచలం మినహా అన్ని మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలుస్తాయి. పోలవరం ముంపు మండలాలను ఆంధప్రదేశ్‌లో కలుపుతూ రూపొందించిన ఏపీ పునర్‌వ్యవ్థసీకరణ చట్టం సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఏపీ పునర్‌వ్యవ్థసీకరణ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సభలో ప్రవేశపెట్టారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ఎంపీల నిరసనల మధ్య పోలవరం బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించింది. ఈ బిల్లుకు రాజ్యసభలో కూడా ఆమోదం లభిస్తే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఆంధప్రదేశ్‌లో విలీనం కానున్నాయి. మూజువాణి ఓటుతో పోలవరం ఆర్డినెన్స్ బిల్లును లోక్ సభ ఆమోదించింది. దీంతో పోలవరం ముంపు మండలాలు ఏడింటిని ఆంధప్రదేశ్‌లోకి కలుపుతూ కేంద్రం ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్సుకు చట్టబద్ధత లభించింది. సభ్యుల నిరసనలతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సమావేశాలను మధ్యాహ్నం రెండు గంటలవరకూ వాయిదా వేశారు. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం పట్టణం మినహా, కుక్కునూరు, వేలేరుపాడు, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, బూర్గంపాడు మండలంలోని ఆరు గ్రామాలు ఆంధప్రదేశ్ రాష్ట్రం పరిధిలోకి రానున్నాయి. లోక్‌సభలో ఆంధప్రదేశ్ పునర్‌వ్యవ్థసీకరణ చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు అని, తప్పకుండా నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే ముంపు ప్రాంతాలను ఆంధప్రదేశ్‌లో విలీనం చేయాల్సిన ఆవశ్యకతను సభకు వివరించారు. దీనివల్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి అవరోధాలు ఉండబోవన్నారు. రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగిస్తుండగానే సభలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆంధప్రదేశ్ పునర్‌వ్యవ్థసీకరణ చట్టం సవరణ బిల్లును టిఆర్‌ఎస్ ఎంపీ వినోద్ తీవ్రంగా వ్యతిరేకించారు. పోలవరం ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. రాష్ట్ర హద్దులను మార్చే ముందు శాసనసభ అభిప్రాయం తీసుకోవాలని సూచించారు. శాసనసభ అభిప్రాయం తీసుకోకుండా పార్లమెంట్‌లో చర్చించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం సరిహద్దులను మార్చడం కుదరదన్నారు. దీనిపై చర్చ జరగాలన్నారు. పోలవరం ఆర్డినెన్స్‌ను లోకసభలో ఆమోదించడంతో ముంపు గ్రామాల విలీనం చట్టబద్దం కానున్నాయి. అలాగే వినోద్ ఇచ్చిన పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను స్పీకర్ తిరస్కరించారు. పోలవరం ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ ఈమేరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. శాసనసభ అభిప్రాయం తీసుకోకుండా పార్లమెంట్‌లో చర్చించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. పోలవరం ముంపు మండలాలను ఆంధ్రాలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. ఐదో రోజు లోక్‌సభ సమావేశాల్లో ఆయన ప్రసంగిస్తూ 1 మార్చి 2014న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. మే 29 న కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడం రాజ్యాంగవిరుద్ధమని ధ్వజమెత్తారు. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాల సరిహద్దులు మార్చేటపుడు ఆయా రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలన్న నిబంధనను కేంద్రం పాటించలేదని ఆరోపించారు. పోలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై సభలో మొదట చర్చ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. స్టాప్ పోలవరం, జైతెలంగాణ అంటూ నినాదాలు చేశారు. టీఆర్‌ఎస్ ఎంపీలకు ఒడిషా, చత్తీస్‌గఢ్ ఎంపీలు గళం కలపడంతో లోక్‌సభ ఆందోళనలతో దద్దరిల్లింది. గిరిజనులకు అన్యాయం చేసేవిధంగా ఉన్న పోలవరం బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆంధప్రదేశ్ పునర్‌వ్యవ్థసీకరణ చట్టం సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధప్రదేశ్‌లో కలపడం దారుణమన్నారు. తెలంగాణ, ఆంధప్రదేశ్ అభిప్రాయాలు తీసుకోకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. పోలవరం డిజైన్ మార్చాలని, వెంటనే కేంద్ర ¬ంశాఖ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదన్నారు. లోకసభలో శుక్రవారం మధ్యాహ్నం పోలవరం ఆర్డినెన్స్ పైన చర్చ ప్రారంభం కాగానే ఆర్డినెన్స్ వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. పోలవరం ఆర్డినెన్స్ డిజైన్ మార్చాలని వారు డిమాండ్ చేశారు. తెరాసకు చత్తీస్‌గఢ్, ఒడిశా ఎంపీలు జత కలిశారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తెరాస ఎంపీ వినోద్ కుమార్ తీర్మానం ప్రవేశ పెట్టారు. అనంతరం ఇరవై నిమిషాలలోనే మూజువాణి ఓటు ద్వారా బిల్లును ఆమోదించారు. తెరాస, ఒడిశా ఎంపీల నిరసనల మధ్యే లోకసభ బిల్లుకు ఆమోదం లభించింది. అనంతరం లోకసభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది. పోలవరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ వ్యతిరేకమని గుత్తా అన్నారు. పోలవరం ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తాము పోలవరంకు వ్యతిరేకం కాదని, డిజైన్ మార్చాలని కోరుతున్నామన్నారు. ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలన్నారు. పోలవరం రాజ్యాంగ విరుద్ధమన్నారు. విభజన తర్వాత రాష్ట్రం అభిప్రాయం తెలియకుండా గ్రామాలను ఎలా ఆంధ్రాలో కలుపుతారని ప్రశ్నించారు. రాష్ట్ర సరిహద్దులు మార్చాలంటే అసెంబ్లీ అభిప్రాయం తీసుకోవాలన్నారు. దానికి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ముంపు మండలాల విలీనం గత ప్రభుత్వం హయాంలోనే జరిగిందన్నారు. ఆదివాసుల హక్కులను కాపాడుతామని చెప్పారు. గిరిజనులకు పునరావాసం కలిపిస్తామని చెప్పారు. పోలవరం నిర్మాణానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఏపీలో కలిపిన మండలాలు గతంలో ఆంధ్రావేనని చెప్పారు. తెరాస, ఒడిశా, చత్తీస్‌గఢ్ ఎంపీల నిరసన మధ్యనే చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ మార్చాల్సిందేనని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలోని ఏడు ముంపు మండలాలను ఆంధప్రదేశ్‌లో కలపటాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.గిరిజనులకు అన్యాయం చేసేవిధంగా ఉన్న పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ మార్చాల్సిందేనని గుత్తా ధ్వజమెత్తారు. ఈ బిల్లుపై నాలుగు రాష్టాల్ర ముఖ్యమంత్రులతో చర్చించాలని ఆయన కోరారు. కేంద్ర ¬ంశాఖ పోలవరం బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. చట్టబద్దంగా లేని బిల్లును బలవంతంగా ఆమోదింప చేయటం ప్రజాస్వామ్యంలో దురదృష్టకరమైన రోజు అని అన్నారు. రాముడేమో తెలంగాణకు ఆయన ఆస్తులు ఆంధప్రదేశ్‌కు బదలాయించటం సరైంది కాదన్నారు. అయితే తాము పోలవరం ప్రాజెక్ట్‌కు వ్యతిరేకం కాదని, ముంపు మండలాలను ఏపీలో కలపటం మంచి పద్ధతి కాదని గుత్తా వ్యాఖ్యానించారు. బలవంతంగా గిరిజన గ్రామాలను ముంపుకు గురి చేయవద్దని ఆయన అన్నారు. అహంకార పూరితమైన మందబలంతో ఆర్డినెన్స్ను ఆమోదించారని గుత్తా మండిపడ్డారు. గిరిజనుల పొట్టగొట్టే పోలవరం డిజైన్ ను మార్చాల్సిందేనని గుత్తా సుఖేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. పోలవరంపై నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ, ఆంధప్రదేశ్ అభిప్రాయాలు తీసుకోకుండా నిర్ణయం సరికాదన్నారు. పోలవరం డిజైన్ మార్చాలని, వెంటనే కేంద్ర ¬ంశాఖ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదన్నారు.
ఆంధ్రాలో కలిసే గ్రామాలు ఇవే
పోలవరం ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లాలోని ఐదు మండలాలు పూర్తిగా, రెండు మండలాలు పాక్షికంగా ఏపీలో కలుస్తాయి. కూనవరం, వీఆర్ పురం, వేలేరుపాడు, కుకునూరు, చింతూరు మండలాలు పూర్తిగా ఏపీలో కలవగా, భద్రాచలం, బూర్గంపాడు మండలాలు పాక్షికంగా కలుస్తాయి. పోలవరం ప్రాజెక్టు కోసం ఈ ఏడు మండలాలలోని 211 గ్రామాలు ఏపీలో కలుస్తాయి. ఈ ప్రాంతంలో 34వేల కుటుంబాలు ఉన్నాయి. లక్షా 16వేల 796 మంది ప్రజలు ఈ ప్రాంతంలో జీవిస్తున్నారు. 3,267 హెక్టార్ల భూమి ఉంది. ఇందులో 187.29 ఎకరాల అభయారణ్యం ముంపునకు గురి కానుంది. ఈ మొత్తం పోలవరం ప్రాజెక్టు కోసం మునుగుతుంది. ఇక్కడి గిరిజనులను ఆదుకుంటామని కేంద్ర ¬ంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు.
గిరిజనుల మనోభావాలను దెబ్బతీశారు : సీతారాం నాయక్
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా గిరిజనుల మనోభావాలను, హక్కులను దెబ్బతీసిందని టీఆర్‌ఎస్ ఎంపీ సీతారామ్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరంపై పార్లమెంట్‌లో బిల్లు తేవడాన్ని ఆయన ఖండించారు. తమ ఎంపీలు పార్లమెంట్‌లో ఎంత మొరపెట్టుకున్నా కేంద్రం వినిపించుకోలేదని ఆయన అన్నారు. ఒక ప్రాంతం ఒత్తిడికి తలవొగ్గి తెలంగాణకు అన్యాయం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆర్డినెన్స్‌పై సుప్రీం కోర్టుకు వెళతామని నాయక్ పేర్కొన్నారు. విూకు అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్లవచ్చునని రాజ్యాంగాన్ని రక్షించాల్సిన సభాపతి అలా మాట్లాడడం పార్లమెంట్ ఖ్యాతిని దిగజార్చినట్లుగా తాము భావిస్తున్నామని సీతారం నాయక్ అన్నారు. రేపు రాజ్యసభలోకి ఈ బిల్లు వెళుతుందని అక్కడ అడ్డుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అక్కడ కూడా తమకు అన్యాయం జరిగితే సుప్రీం కోర్టుకు వెళతామని, న్యాయం తమ వైపే ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
పోలవరంపై ఏకపక్ష నిర్ణయం తగదు : జితేందర్ రెడ్డి
పోలవరం ఆర్డినెన్స్ విషయంలో స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారని టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి మండిపడ్డారు. దేశంలో నడుస్తున్నది మోడీ సర్కారా లేదా చంద్రబాబు సర్కారా అని అనుమానం వస్తున్నదని విమర్శించారు. శాసనసభ అభిప్రాయం తీసుకోకుండా పార్లమెంట్‌లో చర్చించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. పోలవరం ముంపు మండలాలను ఆంధ్రాలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని టీఆర్‌ఎస్ ఎంపీ అన్నారు. మే 29 న కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడం రాజ్యాంగవిరుద్ధమని ధ్వజమెత్తారు. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాల సరిహద్దులు మార్చేటపుడు ఆయా రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలన్న నిబంధనను కేంద్రం పాటించలేదని ఆరోపించారు. కనీసం ఇరు రాష్ట్రాలతో చర్చించకుండా నిర్ణయించడం దాడి చేయడమేనన్నారు. పోలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై సభలో మొదట చర్చ జరపాలని ఆయన డిమాండ్ చేయకపోవడం దారుణమన్నారు. గిరిజనులకు అన్యాయం చేసేవిధంగా ఉన్న పోలవరం బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు టిఆర్‌ఎస్ వ్యతిరేకం కాదని, కేవలం డిజైన్ మార్చాలని అన్నారు. ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలన్నారు. పోలవరం రాజ్యాంగ విరుద్ధమన్నారు. విభజన తర్వాత రాష్ట్రం అభిప్రాయం తెలియకుండా గ్రామాలను ఎలా ఆంధ్రాలో కలుపుతారని ప్రశ్నించారు. రాష్ట్ర సరిహద్దులు మార్చాలంటే అసెంబ్లీ అభిప్రాయం తీసుకోవాలన్నారు.
పోలవరంపై కేంద్రం దుందుడుకు చర్య : పోటు
ఖమ్మం : పోలవరం ఆర్డినెన్స్ బిల్లును ఆమోదించి గిరిజనులకు తీవ్రమైన అన్యాయం చేసారని న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా ప్రజలకు బీజేపీ ద్రోహం చేసిందని ధ్వజమెత్తారు. వనరులను కాజేసేందుకే ముంపు మండలాలను ఆంధ్రాలో కలుపుకున్నారని మండిపడ్డారు. దీనికి ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబే బాధ్యత వహించాలని అన్నారు. గిరిజనులను ముంచి ముందుకు పోవాలనుకోవడం దుర్మార్గమని అన్నారు.
పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందని అన్నారు. త్వరలోనే దీనిపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామన్నారు. ఈనెల 12న ఖమ్మం జిల్లా బంద్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. భాజపా ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలిసారిగా గిరిజనుల బతుకులతో ఆటలాడుతోందని విమర్శించారు. జిల్లాలోని ఏడు మండలాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రలో కలపడానికి వీలు లేదన్నారు. ప్రజాభిప్రాయం సేకరించకుండా ఏకపక్షంగా పీసా చట్టం వంటి గిరిజన చట్టాల ఉల్లంఘిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం చెల్లుబాటు కాబోదన్నారు.