8వ విడత హరితహారం కార్యక్రమం లో మొక్కలు విరివిగా నాటి ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవాలి

-జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష

గద్వాల రూరల్ జులై 16 (జనంసాక్షి):- గద్వాల మండలం శెట్టి ఆత్మకూరు, మదనపల్లి, ఈడిగోని పల్లి, ధరూర్ మండలం పెద్దపాడు, చింతరేవుల, యమునోని పల్లి, జూరాల, రేవులపల్లి, డ్యాం రహదారి ప్రాంతాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఇదివరకు నాటిన మొక్కలు పెరిగినందున వాటికి ఉన్న ట్రీగార్డులను తొలగించి, చిన్న మొక్కలకు కట్టెలు ప్రతిదీ గార్డ్ ఏర్పాటు చేయాలన్నారు. రెవులపల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు.  జూరాల ప్రాజెక్ట్  రిజర్వాయర్ గురించి ఇరిగేషన్అధికారులను అడిగి  తెలుసుకున్నారు. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుండి 1,50,000  ఈ రోజు వరకు క్యూసెక్కుల నీరు వచ్చిందని, 26 గేట్ల ద్వారా  దిగువకు వదిలిపెడుతున్నట్లు అధికారులు కలెక్టర్ కి తెలిపారు.  ఉపాధి హామీ పథకం కింద గుంతలు తవ్వి మొక్కలు నాటే  కూలీల వివరాలను తప్పని సరిగా ఆన్లైన్  లో నమోదు చేయాలని అధికారులకు  ఆదేశించారు. అనంతరం రేవులపల్లిలో మొక్కలను నాటి  వాటిని సంరక్షించాలని  అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతి అధికారి  శ్యాంసుందర్, ఎం పి డి ఓ లు  రవీంద్ర, జబ్బర్, ఎం పి ఓ కృష్ణ మోహన్, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు  తదితరులు పాల్గొన్నారు.