సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు
పట్టువస్త్రాలు సమర్పించిన తెలంగాణ సీఎం కేసీఆర్
అమ్మవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు
పలువురు మంత్రులు, అధికారులు
వేలాదిగా తరలివచ్చి జనం
భక్తులతొ కిక్కిరిసిన ఆలయం
హైదరాబాద్: బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవాలని, ప్రజలను చల్లగా చూడాలని అమ్మవారిని కోరున్నట్లు ఇరు రాష్గాల ముఖ్యమంత్రులు తెలిపారు. తెలంగాణ మంత్రులు ఈటెల రాజేందర్, పద్మారావు, తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కవిత, మాజీ మంత్రి గీతారెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.