సిమెంట్ ధరలు తగ్గవు : కంపెనీల ప్రతినిధులు
హైదరాబాద్ : సిమెంట్ ధరలు ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గవు అని ఆయా సిమెంట్ కంపెనీల ప్రతినిధులు తేల్చిచెప్పారు. మూడేళ్ల పాటు వచ్చిన నష్టాలు పూడ్చుకునేందుకే ధరల పెంపునకు నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ముడి పదార్థాల ధరలు పెరగడం ఇందుకు కారణమని చెప్పారు. ప్రభుత్వాలు సిర్థంగా లేక నిర్మాణ రంగం మందగించిందని తెలిపారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు.