మృతదేహాల అప్పగింతలో పొరపాటును సరిదిద్దిన అధికారులు

హైదరాబాద్‌: ఖననం చేసిన దత్తు అనే విద్యార్థి మృతదేహాన్ని ఈరోజు తీసి అధికారులు తిరిగి పంచనామా నిర్వహించారు. మెదక్‌ జిల్లా కిష్టాపూర్‌లో ఆర్డీవో, డీఎస్పీలు దత్తు మృతదేహాన్ని శోకసంద్రంలో ఉన్న దత్తు తల్లిదండ్రులకు అప్పగించారు. మృతదేహాల అప్పగింతలో పొరపాటు జరగడంతో తొలుత దత్తు మృతదేహాన్ని దర్శన్‌దిగా భావించి దర్శన్‌ తల్లిదండ్రులకు అప్పగించారు. దర్శన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మృతదేహాల అప్పగింతలో గందరగోళం
తూప్రాన్‌ : మెదక్‌జిల్లా మాసాయిపేట ఘటనలో మృతదేహాల అప్పగింతలో పొరపాటు జరిగినట్లు ఈరోజు ఉదయం తెలిసింది. కిష్టాపూర్‌కు చెందిన దర్శన్ణ్‌ొడ్‌ అలియాస్‌ ధనుష్‌కు బదులుగా ఇస్లాంపూర్‌కు చెందిన దత్తు మృతదేహాన్ని అధికారులు తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో వారు శుక్రవారం ఉదయం కిష్టాపూర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం స్పృహలోకి వచ్చిన దర్శన్ణ్‌ొడ్‌ తన పేరు, వూరు వివరాలు చెప్పడంతో దర్శన్‌ తండ్రి స్వామ్ణిొడ్‌కు సమాచారమందించారు. ఆసుపత్రికి చేరుకున్న తల్లిదండ్రులు దర్శన్ణ్‌ొడ్‌ను గుర్తించారు. అయితే ఇప్పటి వరకు తమ కుమారుడు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడని భావించిన దత్తు తల్లిదండ్రులు అసలు విషయం తెలుసుకుని కన్నీరు మున్నీరయ్యారు. ఇదే ప్రమాదంలో దత్తు అక్క కూడా చనిపోయింది. ఇప్పుడు దత్తుకూడా లేడన్న నిజాన్ని వారి తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. జరిగిన పొరపాటును గుర్తించిన అధికారులు కిష్టాపూర్‌ గ్రామానికి చేరుకుని ఖననం చేసిన దత్తు మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా చేసి తల్లిదండ్రులకు అప్పగించారు.