సమగ్ర సర్వే చేయండి

COVER02
19న అందరి ఇంటి వద్దే ఉండండి

ఉద్యోగులు, పోలీసులు సర్వేలో పాల్గొనండి

సర్వే పూర్తయిన ఇంటికి రాజముద్ర

ఒత్తిళ్లకు లొంగొద్దు

సిఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆగస్ట్‌1 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో కచ్చితమైన సమాచారం కుటుంబాలు, వాటి స్థితిగతులు తెలుసుకునేందుకు అధికారులు సమగ్ర సర్వే నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఈ నెల 19న ప్రజలందరూ ఇంటివద్దే ఉండి అధికారులకు తగిన సమాచారం అందించాలని సూచించారు. ఉద్యోగులు, పోలీసులు ఈ సర్వేలో పాల్గొనాలని, సర్వే పూర్తయిన ఇంటికి రాజముద్ర వేయాలని అన్నారు. అధికారులు ఎలాంటి ఒత్తిళ్ళకు లొంగకుండా విధినిర్వహణ చేయాలని ఉపదేశించారు. ప్రజలకు ఏవైతే హావిూలు ఇచ్చి అధికారంలోకి వచ్చామో వాటిని వంద శాతం కచ్చితంగా అమలుచేసి తీరుతామని ఆయన పునరుద్ఘాటించారు.  మాదాపూర్‌ హైటెక్స్‌లో జరుగుతున్న అధికారుల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులకు రుణమాఫీ, రెండు బెడ్‌రూమ్‌ల ఇళ్లు వంటి తదితర హావిూలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు. కాకపోతే ఇవి వందశాతం అర్హులకే అందేలా చూస్తామన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అనర్హులకూ దక్కనీయమన్నారు.రాష్ట్రంలో 86 లక్షల కుటుంబాల గణన ఒకే రోజు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. సర్వే కోసం అన్ని వనరులను ఉపయోగించుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో 84 లక్షల కుటుంబాలు ఉంటే కోటీ 7 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయని పేర్కొన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌ పథకం కింద ప్రభుత్వం విూద 4వేల కోట్ల భారం పడుతుందన్నారు. దీనిని పారదర్శకంగా అమలు చేసేందుకే ఫాస్ట్‌ పథకాన్ని అమలు చేయబోతున్నామని అన్నారు. ప్రతి దానికి వైట్‌ రేషన్‌ కార్డునే లింక్‌ పెట్టి, 55 లక్షల ఇండ్ల కట్టించినట్లుగా లెక్కుల చెబుతున్నారని అన్నారు. గృహనిర్మాణ రంగంలో వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. అర్హులకు పించన్లు ఇస్తామని, ఇండ్లు కట్టిస్తామని తెలిపారు. ప్రాణం పోయినా అనర్హులకు రేషన్‌ కార్డు ఇవ్వబోమన్నారు. ఇవన్నీ సక్రమంగా అమలు చేసే క్రమంలోనే సర్వేలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న సర్వేలు సరైన పంథాలో జరగలేదని గత సర్వేలన్నీ తప్పుడు తడకలేనని కేసీఆర్‌ అన్నారు. ప్రభుత్వం ప్రతి విషయంలో లక్ష్యం, గమ్యం ప్రకారం ముందుకు వెళ్తుందని తెలిపారు. సరైన లెక్కలు లేని కారణంగానే కుంభకోణాలు, భూ దోపిడీలు జరుగుతున్నాయని అన్నారు. పకడ్బందీ లెక్కాపత్రం కోసమే సర్వే అని స్పష్టంచేశారు. సర్వేలు సమగ్రంగా చేస్తే సమాజానికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ప్రణాళిక ప్రకారం సర్వేలు జరుగుతాయని, అన్ని ప్రభుత్వ శాఖ అధికారుల వద్ద సర్వే వివరాలు ఉంటాయని తెలిపారు. తెలంగాణలో 84 లక్షల కుటుంబాలు ఉంటే.. 91 లక్షల తెల్ల కార్డులు ఉన్నాయని అన్నారు. అవసరం ఉన్నవారికి రేషన్‌కార్డులు ఇవ్వాలి తప్ప అనర్హులకు కాదని స్పష్టం చేశారు. ప్రతి పైసాను అభివృద్ధి, మంచి కార్యక్రమాలకు ఉపయోగించాలని అన్నారు. నిజాం రాజు మనకు పెద్ద ఖజానానే ఇచ్చి పోయారు. సీమాంధ్ర దుర్మార్గులు తెలంగాణ భూములను దోచుకున్నారు. ఆభూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. తెలంగాణలో వ్యవసాయానికి పనికిరాని భూమి 20 లక్షల ఎకరాలు ఉంది. హైదరాబాద్‌లో పెట్టుబడులు పారిశ్రామిక వేత్తలు ఉత్సాహం చూపిస్తున్నారు. వ్యవసాయానికి అనుకూలంగా లేని భూమిని పరిశ్రమల స్థాపనకు ఉపయోగిస్తమన్నారు. భగవంతుడు ఇచ్చిన అపురూపమైన సంపద భూమి అని చెప్పారు.
కలెక్టర్లూ బహు పరాక్‌
జిల్లా కల్టెర్లు మనసు పెట్టి పనులు చేయించాలన్నారు. ఒక్క తప్పుడు సర్టిఫికేట్‌ జారీచేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాణం పోయినా అర్హులకు అన్యాయం జరగనివ్వమన్నారు. నేటివిటీని ధృవీకరించుకునే హక్కు రాష్టాన్రికి ఉందని తేల్చి చెప్పారు. ఒక్క నిర్లక్ష్యానికి భవిష్యత్‌ తెలంగాణ ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తదన్నారు. కుటుంబాల సూక్ష్మస్థాయి సర్వే సన్నాహాక సదస్సు మాదాపూర్‌ హైటెక్స్‌లో ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు, ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లు, జేసీలు, ఆర్డీవోలు, ఎమ్మార్వోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ… కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం తన పథాన్ని, మార్గాన్ని నిర్దేశించుకుంటున్నది. ఆశించిన స్థాయిలో పేదరిక నిర్మూలన జరగటం లేదు. అంతాకలిసి చిత్తశుద్ధితో పనిచేస్తేనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నేరవేరుస్తం. ప్రతి పనికి ఒక లక్ష్యం, గమ్యం ఉండాలని సీఎం పేర్కొన్నారు.  రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన సర్వేలు సరిగ్గాలేవు. ఒక్కో సర్వే ఒక్కో రకంగా ఉంటది. సరైన లెక్కలు లేకపోవడంతోనే కుంభకోణాలు జరుగుతున్నాయి. ఆశించిన స్థాయిలో పేదరిక నిర్మూలన జరగటం లేదు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ప్రజలకు చాలా ఆశలు ఉన్నయి. సర్వేలు మొక్కుబడిగా చేస్తే ప్రయోజనం ఉండదని సీఎం పేర్కొన్నారు.
దళితుల నిధులు వారికే ఖర్చు
తెలంగాణ రాష్ట్రంలో 12లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి. 3 లక్షల దళిత కుటుంబాలు అర్బన్‌ ఏరియాలో ఉన్నారు. ప్రతి దళిత కుటుంబానికి భూమి లేకుండా ఉండదు. దళితులకు కేటాయించిన నిధులు వారికే ఖర్చు చేస్తామని కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణలో ఏ ఊరిలో చూసినా భూమి రేటు రూ. 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉంది. ఆగస్టు 15న భూమి పంపిణీ కార్యక్రమం ప్రారంభిద్దామని సీఎం పేర్కొన్నారు. అందరికీ ఒకే సారి భూమి కొనివ్వాల్సిన అవసరం లేదు. విడతల వారీగా కొనివ్వొచ్చని చెప్పారు. సంవత్సరానికి వెయ్యి నుంచి 2వేల కోట్లు భూమి కొనుగోలుకు కేటాయిస్తామని తెలిపారు. గత ప్రభుత్వాలు 31 ఏళ్లలో కొనుగోలు చేసి ఇచ్చిన భూమి 41 వేల ఎకరాలకు మించలేదన్నారు. ఒకటి రెండేళ్లలో లక్ష దళిత కుటుంబాలకు భూమి ఇచ్చిన మనం గ్రేటేనని వెల్లడించారు. కమతాల ఏకీకరణ కోసం కలెక్టర్లు కృషి చేయాలని ఆదేశించారు. రిజిస్టేష్రన్‌ ఫీజు లేకుండా కమతాల ఏకీకరణ కోసం ప్రభుత్వం కృషి చేస్తదన్నారు.
విూడియా తీరు సరికాదు
చాలా విషయాల్లో విూడియా కన్ఫ్యూజ్‌ క్రియేట్‌ చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మండిపడ్డారు. ప్రభుత్వాన్ని కావాలని అప్రతిష్టపాలు చేసేందుకు కొన్ని పత్రికలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. పిచ్చి రాతలు రాయడం మానుకోవాలని, ప్రభుత్వ పథకాలపై పిచ్చి రాతలు రాయొద్దని హెచ్చరించారు. అవసరమైతే ఒకసారి ప్రభుత్వాన్ని కూడా సంప్రదించాలని సూచించారు. పిచ్చి రాతలు రాయడం మంచి పద్దతి కాదన్నారు. టైమ్స్‌ పత్రికలో వచ్చిన వార్తకు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా సమాధానం చెప్పాలన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రిని డవ్మిూ చేశారంటూ ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనంపై కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. విూడియా హద్దుల్లో ఉండాలన్నారు. ఇప్పటికీ కొన్ని విూడియా సాధనాలు ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలని భావిస్తున్నాయని, అలాంటి సాధనాలతో వారేవిూ చేయలేరని కేసీఆర్‌ అన్నారు. ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని కేసీఆర్‌ అన్నారు. త్వరలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పత్రిక తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు కేసీఆర్‌ తెలిపారు.