కేంద్ర పెత్తనాన్ని సహించం
మంత్రి మండలి సలహామేరకే గవర్నర్ పని చేయాలి
మీతీరు రాజ్యాంగ విరుద్ధం
ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ
హైదారబాద్ ఆగస్టు 9 (జనంసాక్షి):
ఉమ్మడి రాజధాని పరిధిలో శాంతిభద్రతలు తదితర అంశాలపై గవర్నర్‌కు అధికారాలు కల్పిస్తూ కేంద్రహోంశాఖ లేఖ రాయడాన్ని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు ప్రధాని మోడీకి ముఖ్యమంత్రే స్వయంగా లేఖ రాశారు. కేంద్ర పెత్తనాన్ని సహించబోమని మంత్రి మండలి సలహామేరకే గవర్నర్ నడుచుకోవాలని కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రం రాసిన లేఖ సారాంశాన్ని వెల్లడిస్తూ సీఎం ప్రతిలేఖ రాశారు. గవర్నర్ చేతిలో శాంతి భద్రతలు పెట్టాలని సూచిస్తూ కేంద్రం నిర్ణయించింది. హైదరాబాద్‌కు సంబంధించి హెచ్‌ఎంవోలు ఏసీపీలు, డీసీపీల పోస్టింగ్‌ల వ్యవహారం సైతం గవర్నర్ కలుగజేసుకునే విధంగా లేఖ సారంశం ఉన్నది. కేంద్ర ¬ంశాఖ పంపిన లేఖతో కలత చెందాను. మంత్రివర్గం నిర్ణయాన్ని కాదనడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. రాష్ట్ర మంత్రిమండలి సలహా మేరకే గవర్నర్ పనిచేయాలి. విభజన చట్టం కూడా ఇదే విషయం స్పష్టంగా చెబుతోంది. ¬ంశాఖ రాసిన లేఖ ప్రతిని ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ తాను రాసిన లేఖతో పాటు పంపారు.కాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా గవర్నర్ కు అధికారాలు అప్పజెప్పబోమని మరోలేఖ రాశారు. ఈ లేఖ సారాంశం ఇలాఉంది.
ఉమ్మడి రాజధానిలో గవర్నర్ పాలన సాధ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. గవర్నర్‌కు విస్తృత అధికారాలు అప్పగించలేమని స్పష్టం చేసింది. మంత్రిమండలి సలహా మేరకే గవర్నర్ పని చేయాలని తేల్చిచెప్పింది. అంతేకానీ రాజ్యాంగ మౌళిక సూత్రాలకు విరుద్ధంగా శాంతిభద్రతల వ్యవహారాలు గవర్నర్ చేతిలో పెట్టలేమని స్పష్టం చేసింది. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలపై కేంద్ర
ప్రభుత్వం నుంచి లేఖపై ప్రభుత్వం స్పందించింది. గవర్నర్‌కు అధికారాలు అప్పగించబోమని స్పష్టం చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం కేంద్రానికి లేఖ రాశారు. రాజ్యాంగంలోని 163 అధికరణం ప్రకారం మంత్రిమండలి సలహా మేరకే గవర్నర్ పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర అధికారాల్లో కేంద్ర జోక్యం తగదని స్పష్టం చేశారు. శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలోనివని, ఇందులో కేంద్ర జోక్యాన్ని సహించబోమని లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. పునర్విభజన చట్టానికి లోబడే మంత్రివర్గ నిర్ణయాల మేరకే గవర్నర్ కార్యాలయం పని చేస్తుందని తన లేఖలో తెలిపారు. గవర్నర్ అధికారాలు అమలు చేయడం సాధ్యం కాదని శర్మ కేంద్రానికి తేల్చి చెప్పారు. రాష్ట్ర విషయంలో కేంద్రం జోక్యం తగదని, పూర్తి స్థాయిలో గవర్నర్‌కు అధికారాలు అప్పగించలేమని లేఖలో పేర్కొన్నారు.
ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలు, పాలనా వ్యవహారాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం గవర్నర్‌కు కల్పిస్తున్న విశేషాధాకారాలను అమలు చేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ¬ం శాఖ తెలంగాణ ప్రభుత్వానికి శుక్రవారం లేఖ రాసింది. తెలంగాణ, ఏపీ రాష్టాల్రు రెండూ కుదురుకొనే వరకూ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనలు అమలయ్యేలా చూడాల్సిన రాజ్యాంగ బాధ్యత తనపై ఉందని కూడా లేఖలో స్పష్టంగా పేర్కొంది. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రలకు సంబంధించి విభజన చట్టంలోని 8వ సెక్షన్ గవర్నర్‌కు విశేషాధికారాలు కట్టబెడుతోందని, వాటి అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని 13 ప్రత్యేకాంశాలను నిర్దుష్టంగా పేర్కొంది. ప్రధానంగా పాలనకు సంబంధించిన అన్ని దస్త్రాలను గవర్నర్‌కు దృష్టికి తీసుకెళ్లాలని, మంత్రిమండలి నిర్ణయాలను అడిగే అధికారం ఆయనకు ఉందని కేంద్రం పేర్కొంది. హైదరాబాద్, సైబరాబాద్, రంగారెడ్డి జిల్లా ఎస్పీ శాంతిభద్రతలకు సంబంధించి నివేదికలు గవర్నర్‌కు సమర్పించాలని సూచించింది. అన్ని అంశాలపై గవర్నర్ నిర్నయమే అంతిమమని తెలిపింది. గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించే విషయంలో బిజినెస్ ట్రాన్సక్షన్ నిబంధనలు మార్చుకోవాలని సూచించింది. అయితే, కేంద్ర నిర్ణయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఫాసిస్టు విధానాలతో రాష్టాల్ర అధికారాలను కబళించేందుకు యత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, దీనిపై తీవ్ర అభ్యంతరం తెలుపుతూ సమాధానం ఇవ్వాలని సీఎస్‌ను ఆదేశించారు. అలాగే, అన్ని రాష్టాల్ర ముఖ్యమంత్రులకు కేంద్ర లేఖ ప్రతిని పంపించాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం సీఎస్ రాజీవ్ శర్మ ముఖ్యమంత్రిని కలిసి ఇదే అంశంపై చర్చించారు. అనంతరం
ఆయన గవర్నర్ నరసింహన్‌తోనూ సమావేశమయ్యారు. కేంద్ర లేఖపై ఆయనతో చర్చించినట్లు సమాచారం. ఆ తర్వాతే సీఎస్ కేంద్రానికి లేఖ రాశారు.