సమగ్ర సర్వేకు సర్వం సిద్ధం
పట్నం నుంచి పల్లెకు పరుగులు
కేసీఆర్ చెప్పిండు.. మేం పోతున్నాం..
ఖాళీ అయిన హైదరాబాద్
అష్టకష్టాలు పడి పల్లెలకు పాలమూరు వలస జీవులు
హైదరాబాద్, ఆగస్టు18 (జనంసాక్షి) :
సమగ్ర సర్వేకు సర్వం సిద్ధమైంది. కేసీఆర్ చెప్పిండు.. మేం పోతున్నాం.. అంటూ గ్రామీణులు పట్నం నుంచి పల్లెకు పరుగులు తీశారు. దీంతో హైదరాబాద్ ఖాళీ అయ్యింది. అష్టకష్టాలు పడి పాలమూరు వలస కూలీలు పల్లెలకు చేరుకున్నారు. తెలంగాణలోని 10 జిల్లాల్లో సర్వే జాతర మొదలయ్యింది. అందరూ పెట్టాబేడా సర్దుకుని ఊళ్లకు చేరుకుంటున్నారు. మంగళవారం ఒక్కరోజు సర్వే కోసం దూర ప్రాంతాల్లో ఉన్నవారు ఇప్పటికే గ్రామాలకు చేరుకున్నారు. ఇక చుట్టుపక్కల ఉన్నవారు సోమవారం సాయంత్రానికి చేరుకున్నారు. దీంతో పల్లెల్లో సందడి కనిపిస్తోంది. సహజంగా దసరాకు మాత్రమే ఇలా పెద్ద ఎత్తున ఊళ్లకు చేరుకుంటారు. కానీ సర్వే కారణంగా ఇప్పుడు అందరూ పల్లెలకు చేరడంతో గ్రామాలు సందడిగా మారాయి. ప్రయాణికుల రద్దీ కారణంగా బస్సులు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. సమగ్ర సర్వేలో పాల్గొనడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో సొంతూళ్లకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు, రైళ్లు ప్రయాణీకులతో కిటకిటలాడు తున్నాయి. రైల్వేస్టేషన్‌లు, బస్సుస్టాండ్