సింగపూర్‌లో సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం

CCCC
తెలంగాణ మార్కెటింగ్‌లో ముుఖ్యమంత్రి

హైదరాబాద్‌, ఆగస్టు 20 (జనంసాక్షి) : సింగపూర్‌లో సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం లభించింది. తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి అన్వేషణలో ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ ఉదయం 6 గంటలకు సీఎం కేసీఆర్‌ సింగపూర్‌ చేరుకున్నారు. సింగపూర్‌లోని రిట్జ్‌ కార్టన్‌ ¬టల్‌ వద్ద కేసీఆర్‌కు ఎన్నారైలు స్వాగతం పలికారు. 22న ఐఐఎం పూర్వ విద్యార్థుల సదస్సు జరిగే స్టేడియాన్ని ఉదయం 11 గంటలకు సీఎం పరిశీలించారు. అనంతరం మధ్యాహ్నం స్థానిక జేటీసీ ఆఫీసును సందర్శించారు. రేపు ఉదయం 11 గంటలకు హైకమిషనర్‌తో, సాయంత్రం 4 గంటలకు విదేశాంగ మంత్రితో సీఎం సమావేశం కానున్నారు. 22న ఇంఫాక్ట్‌ సదస్సులో పాల్గొననున్నారు. సదస్సులో ప్రసంగించడంతోపాటు నిపుణులైన పారిశ్రామికవేత్తల అనుభవాలను కేసీఆర్‌ క్షుణ్నంగా తెలుసుకోకున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు సింగపూర్‌ ప్రభుత్వ పెద్దలతో సీఎం భేటీ కానున్నారు. 23న సింగపూర్‌ నుంచి కౌలాలంపూర్‌కు సీఎం కారులో బయల్దేరనున్నారు. అనంతరం 24న రాత్రికి అక్కడి నుంచి హైదరాబాద్‌కు సీఎం బయల్దేరనున్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుతోపాటు ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌, సీఎంఓ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ నర్సింగ్‌రావు, పరిశ్రమలశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కే.ప్రదీప్‌చంద్ర, పరిశ్రమల శాఖ కమిషనర్‌ జయేష్‌రంజన్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీశాఖ కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్‌, సీఎం కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు కే.సుధీర్‌రెడ్డి, ఎం.గోపాల్‌ రావు, ఫిక్కీ తరఫున దేవేందర్‌ సురానా సింగపూర్‌కు వెళ్లారు.