గవర్నర్‌కు అధికారాలంటే మా హక్కులు హరించడమే

COVER22
¬ంమంత్రికి టిఆర్‌ఎస్‌ ఎంపీల అభ్యంతరం

న్యూఢిల్లీ, ఆగస్టు 21 (జనంసాక్షి) : గవర్నర్‌కు అధికారాలు ఇవ్వడమంటే తమ హక్కులను హరించడమే అవుతుందని టిఆర్‌ఎస్‌ ఎంపీల అభ్యంతరం వ్యక్తంచేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నర్‌కు అధికారాలను అంగీకరించమని గురువారం టిఆర్‌ఎస్‌ ఎంపీలు కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు స్పష్టంచేశారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమన్నారు. ప్రత్యేక అధికారాలను అప్పగించడం అంటే రాష్ట్రాల అధికారాలను హరించచడమే అవుతుందని సీనియర్‌ ఎంపీ కె.కేశవవరావు అన్నారు.  కేంద్ర ¬ంమంత్రితో టీఆర్‌ఎస్‌ ఎంపీలు గురువారం ఉదయం సమావేశమయ్యారు. ఎంపీ కే.కేశవరావు నేతృత్వంలో 8 మంది ఎంపీలు, ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి ఈ సమావేశంలో పాల్గొన్నారు. గవర్నర్‌కు అధికారాలు అప్పగింత అంశంపై ఎంపీలు ¬ంమంత్రితో చర్చించారు. గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఇస్తే రాష్ట్ర హక్కులను హరించడమేనని ఎంపీలు తేల్చి చెప్పారు. అనంతరం టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ ఎంపీ కె.కేశవరావు మాట్లాడుతూ సెక్షన్‌-8 కింద రాష్ట్ర అధికారాలు తీసుకోవడం సరికాదని ¬ంమంత్రికి చెప్పినట్లు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం సమైక్య విధానాన్ని గౌరవించాలని చెప్పామని అన్నారు. కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో చర్చలు సఫలం అయ్యాయని ఎంపీ కేకే తెలిపారు. రాష్ట్ర అధికారాలను తగ్గించబోమని రాజ్‌నాధ్‌సింగ్‌ చెప్పారని, రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారమే నడుచుకుంటామన్నారన్నారు. ముఖ్యమంత్రి అధికారాలను హరించబోమని, రాష్టాల్ర హక్కుల అధికారాల్లో జోక్యం చేసుకోమని రాజ్‌నాథ్‌ చెప్పారని కేకే తెలిపారు. సమాఖ్య స్ఫూర్తిని కాపాడుతామన్నారన్నారు. కాగా అంతకు ముందు గవర్నర్‌కు అధికారాలు అప్పగింత అంశంపై ఎంపీలు ¬ంమంత్రితో చర్చించారు. గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఇస్తే రాష్ట్ర హక్కులను హరించడమేనని ఎంపీలు తేల్చిచెప్పారు. గవర్నర్కు అధికారాలు ఇవ్వవద్దని స్పష్టం చేశారు. ఇక నరసింహన్‌ ఢిల్లీ టూర్‌ నేపథ్యంలో వీరి సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. 2014 పునర్విభజన చట్టంలో సెక్షన్‌8లో పేర్కొన్న మేరకు హైదరాబాద్‌పై గవర్నర్‌కు ఇచ్చిన అధికారాలను వ్యతిరేకిస్తూ ఓ నివేదికను ఎంపీలు రాజ్‌నాథ్‌కు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌పై అధికారాలను గవర్నర్‌కు కట్టపెడుతూ 12 అంశాల మేరకు బిజినెస్‌ రూల్స్‌ ప్రకారం మార్పులు చేసుకోవచ్చని కేంద్ర ¬ంశాఖ ఆదేశిస్తూ సర్కులర్‌ను జారీ చేసింది. అయితే ఆ సర్కులర్‌ను తెలంగాణ ప్రభుత్వం తిప్పికొట్టింది. సెక్షన్‌ 8లో ఉన్న విధంగా 12 అంశాలు, పూర్తి అధికారాలు గవర్నర్‌కు కట్టబెట్టడం అంటే రాష్ట్ర అధికారాలను పరోక్షంగా గవర్నర్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడమే అని, ఇది రాజ్యాంగానికి విరుద్ధమని ప్రభుత్వం తెలిపింది. ఎక్కడైనా మంత్రి మండలి సలహా మేరకే గవర్నర్‌ ప్రవర్తించాలని, ఆయనకంటూ ప్రత్యేక అధికారులు ఉండవని పేర్కొంది. సెక్షన్‌ 8ను తాము అంగీకరిస్తున్నామని, అయితే సెక్షన్‌ 8లో పేర్కొన్న విధంగా12 అంశాలు లేవని, వాటిలో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని టి.ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్‌లో గవర్నర్‌కు అధికారాల అప్పగింత అంశంపై చర్చించిన ఎంపీలు ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నర్‌కు అధికారాలు ఇవ్వవద్దని రాజ్‌నాథ్‌కు చెప్పారు. గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఇస్తే రాష్ట్ర హక్కులు హరించడమేనని వారు పేర్కొన్నారు. సెక్షన్‌-8 కింద రాష్ట్ర అధికారాలు తీసుకోవడం సరికాదని కె.కేశవరావు అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం సమాఖ్య విధానాన్ని గౌరవించాలని చెప్పామని ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు. చట్టప్రకారమే గవర్నర్‌ నిర్ణయాలు తీసుకుంటారని, ముఖ్యమంత్రి అధికారాలు తగ్గించబోమని రాజ్‌నాథ్‌ చెప్పారని ఆయన అన్నారు.¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఎంపీలు కేకేతో పాటు జితేందర్‌రెడ్డి, వివేక్‌, బీవీ పాటిల్‌, కవిత, బాల్కాసుమన్‌, విశ్వేశ్వర్‌రెడ్డి, నగేశ్‌ సమావేశంలో పాల్గొన్నారు.