కేసీఆర్‌ సింగపూర్‌ టూర్‌ సక్సెస్‌

C

రాష్ట్రానికి సిఎం

హైదరాబాద్‌, ఆగస్టు 24 (జనంసాక్షి) : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సింగపూర్‌ పర్యటన విజయవంతంగా ముగిసింది. సింగపూర్‌లో తన నాలుగు రోజుల అధికార పర్యటనను ముగించుకుని సీఎం ఆదివారం రాత్రికి హైదరాబాద్‌కు వచ్చారు. రాత్రి 12గంటల సమయంలో ఆయన మలేషియా రాజధాని కౌలాలంపూర్‌ నుంచి విమానంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో ఉప ముఖ్యమంత్రులు మహమూద్‌ అలీ, రాజయ్య, ¬ంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్వాగతం పలికారు. అక్కడినుంచి నేరుగా ఆయన బేగంపేటలోని తన క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. సింగపూర్‌లో పూర్వపు ఐఐఎం విద్యార్థుల ఆహ్వానం మేరకు ఆయన సింగపూర్‌ వెళ్లిన విషయం తెలిసిందే. కేసీఆర్‌ తన తొలి విదేశీ పర్యటనను విజయవంతంగా కొనసాగించారు. సింగపూర్‌లో రెండు రోజుల పాటు పర్యటించిన ఆయన ఆ తర్వాత సింగపూర్‌ నుంచి మలేసియాకు రోడ్డు మార్గంలో వెళ్ళారు. సింగపూర్‌ నుంచి మలేసియా వరకు జరిగిన అభివృద్ధిని ప్రత్యక్షంగా కళ్లారా చూసేందుకు వీలుగా ఆయన ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇందుకోసం ఆయన శనివారం ఉదయం 11 గంటలకు బయల్దేరి సాయంత్రం 4 గంటలకు మలేసియా రాజధాని కౌలాలంపూర్‌ చేరుకున్నారు. ఈ మార్గమధ్యంలో అనేక చోట్ల అభివృద్ధి పనులను ఆయన ప్రత్యక్షంగా వీక్షించారు.