నామినేషన్ల రోజే ప్రచార ¬రు
మెదక్ పార్లమెంటుకు ముగిసిన నామినేషన్ల ఘట్టం
తెరాస అభ్యర్థిగా కొత్త ప్రభాకర్‌రెడ్డి
కాంగ్రెస్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి
భాజపా అభ్యర్థిగా జగ్గారెడ్డి
ఇది తెలంగాణవాదులకు, ద్రోహులకు మధ్య పోటీ : మంత్రి హరీశ్
గెలుపు నాదే : సునీత
సింగపూర్ అయ్యజేస్తా : జగ్గారెడ్డి
సంగారెడ్డి, ఆగస్టు 27 (జనంసాక్షి) : మెదక్ ఉప ఎన్నికకు నామినేషన్ల రోజునే ప్రచార ¬రు ఊపందుకుంది. బుధవారంతో నామినేషన్ల ఘట్టం ముగిసింది. తెరాస అభ్యర్థిగా కొత్త ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి, భాజపా, టిడిపి కూటమి అభ్యర్థిగా జగ్గారెడ్డి నామినేషన్ దాఖలుచేశారు. నామినేషన్ అనంతరం నేతలు మాట్లాడుతూ గెలుపుపై ఎవరికివారు ధీమా వ్యక్తంచేశారు. ఈ ఉప ఎన్నికను తెలంగాణవాదులకు, తెలంగాణద్రోహులకు మధ్య పోటీగా మంత్రి హరీశ్‌రావు అభివర్ణించారు. ఎలాగైనా ఈ పోరులో గెలుపు తనదేనని సునీతాలక్ష్మారెడ్డి ధీమా వ్యక్తంచేశారు. మెదక్‌ను సింగపూర్ అయ్యజేస్తా అని జగ్గారెడ్డి చెప్పారు.
టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలుచేసిన అనంతరం హరీశ్‌రావు విూడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే ఘన విజయమని ధీమా వ్యక్తంచేశారు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఎవరు నిలుస్తారన్నది కాంగ్రెస్, బీజేపీలు తేల్చుకోవాలన్నారు. ఈ ఎన్నిక ఉద్యమకారులకు, ఉద్యమద్రోహులకు మధ్య.. తెలంగాణ ఉద్యమ పార్టీకి, తెలంగాణ ద్రోహులకు జరిగే ఎన్నిక ఇది అని తెలిపారు. మంత్రిగా ఉండి తెలంగాణ ఉద్యమకారులపై కేసులు పెట్టించిన వ్యక్తి ఒకరు (సునీతాలక్ష్మారెడ్డి) కాగా.. తెలంగాణ వద్దని, తాను సమైక్యవాదినని బహిరంగంగా ప్రకటించుకున్న వ్యక్తి మరొకరు (జగ్గారెడ్డి) అని విమర్శించారు. వారికి ప్రజలు ఎలా ఓట్లు వేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి చివరివరకు అభ్యర్థి దొరకలేదని.. బీజేపీలో పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయం ఖాయమన్నారు. సీమాంధ్ర ముఖ్యమంత్రులకు వత్తాసు పలికిన వ్యక్తికి బీజేపీ టికెట్ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ఉద్యమ ద్రోహులకు, తెలంగాణ వ్యతిరేకులకు విజ్ఞులైన మెదక్ ప్రజలు ఓటు వేసే ప్రసక్తే ఉండదన్నారు. మెదక్ జిల్లా ఉద్యమాల ఖిల్లా అని.. తెలంగాణ ఉద్యమానికి గడ్డ అయిన మెదక్‌లో తెలంగాణ వ్యతిరేకులకు ఓట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి, ఢిల్లీకి వెళ్లి లాబీయింగ్ చేసిన వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తారా? అని అడిగారు. తెలంగాణ కోసం ముమ్మరంగా ఉద్యమించిన వ్యక్తి టికెట్ రాకపోయినా పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తి ప్రభాకర్‌రెడ్డి అని అన్నారు. ఆయనకు ప్రజల మద్దుతు సంపూర్ణంగా ఉందన్నారు. ఏం చూసి బీజేపీకి ఓటు వేయాలని హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘పోలవరం ప్రాజెక్టు బలవంతంగా కట్టి గిరిజనులను ముంచుతున్నందుకు బీజేపీకి ఓటేయాలా..? హైదరాబాద్‌లో గవర్నర్ పాలన పెట్టి ప్రజల హృదయాలను గాయపరినందుకు ఓటు వేయాలా..? తెలంగాణకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వకుండా మొండిచేయి చూపినందుకు ఓటు వేయాలా..? చంద్రబాబుకు మద్దతు పలుకుతూ కరెంట్ కోతలకు కారణమైనందుకా.. లేక తెలంగాణ ద్రోహికి టికెట్ ఇచ్చినందుకు బీజేపీకి ఓటేయాలా?’ అని నిలదీశారు. తమ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ అంశాన్ని అమలు చేస్తోందన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను కూడా అమలు చేస్తుందన్నారు. దళితుల ఆడబిడ్డల పెళ్లళ్లకు కల్యాణ లక్ష్మి పథకం తీసుకొచ్చామని, ముస్లిం మైనార్టీల పెళ్లిళ్లకు రూ.51 వేలు ఇస్తున్నది తమ ప్రభుత్వమేనన్నారు. ఆర్బీఐ ఒప్పుకోకపోయినా రూ.19 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని కేసీఆర్ రైతులకు ధైర్యం ఇచ్చారని తెలిపారు. పక్క రాష్ట్రం కంటే వేగంగా తెలంగాణను అభివృద్ధి చేస్తున్న ఘనత తమదేనన్నారు. ప్రజలు తమ వైపే ఉంటారన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒకరకంగా సెల్ఫ్ గోల్ చేసుకున్నాయని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ వ్యతిరేకులను ఎన్నికల్లో పోటీకి దింపి ఓటమిని అంగీకరించాయని తెలిపారు. పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకక పోతే చివరకు సునీతాలక్ష్మారెడ్డిని బలవంతంగా నిలబెట్టారని పత్రికల్లో వార్తలు వస్తున్నాయన్నారు. పోయిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తాము పోటీ చేయలేమని చెబితే.. ఇక ఎవరూ దొరకక పరాయి పార్టీ నుంచి అభ్యర్థిని అరువుతెచ్చుకున్న పరిస్థితి బీజేపీది అని ఎద్దేవా చేశారు. నాది సమైక్యవాదమేనని బేషరతుగా ప్రకటించుకున్న వ్యక్తికి బీజేపీ టికెట్ ఇవ్వడం విడ్డూరమన్నారు. సంగారెడ్డిని తీసుకుపోయి బీదర్‌లో కలపాలని, హైదరాబాద్‌లో కలపాలని చిత్రవిచిత్రంగా మాట్లాడిన జగ్గారెడ్డికి ప్రజలు ఎలా ఓట్లు వేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలు రెండో స్థానం కోసమే పోటీ పడుతున్నాయని తెలిపారు. రెండో స్థానం ఎవరిదో విూరే తేల్చుకోండని సూచించారు. ఇప్పటివరకు నరేంద్ర మోడీ విూద, కిషన్‌రెడ్డి విూద కొంత గౌరవం ఉండేది.. జగ్గారెడ్డికి టికెట్ ఇచ్చి ఉన్న గౌరవాన్ని పోగొట్టుకున్నారని అన్నారు. జగ్గారెడ్డిని నిలబెట్టి కిషన్‌రెడ్డి బీజేపీ పరువు తీశాడని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు సిఫార్సు చేసిన వ్యక్తికి టికెట్లు ఇచ్చే పరిస్థితి బీజేపీలో నెలకొందని ఎద్దేవా చేశారు. తెలంగాణకు అన్ని విధాలుగా అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును చూసి మెదక్‌లో పోటీ చేసేందుకు బీజేపీ నేతలు ఒక్కరూ కూడా ముందుకు రాలేదని చెప్పారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలని ఒక్క అంశాన్నైనా నెరవేర్చిందా? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి వెంట ఉపసబాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, చింత ప్రభాకర్, బాబూమోహన్ తదితరులు హాజరయ్యారు. నామినేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
టీఆర్‌ఎస్ ఇచ్చిన హావిూలను విస్మరించిందని, ఈ మూడు నెలల కాలంలో ప్రజల్లో వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకతే తమను గెలుపిస్తుందని మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా సునీతాలక్ష్మారెడ్డి బుధవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు దామోదర రాజనర్సింహా, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, వీ.హనుమంతరావు తదితరులు హాజరయ్యారు. మెదక్ జిల్లా సంగారెడ్డి కలెక్టరేట్‌లో నామినేషన్ పత్రాలు సమర్పించిన అనంతరం సునీత విూడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకం ఉందన్నారు. మూడు నెలల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూలను నెరవేర్చడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు.మెదక్ లోక్‌సభకు జరుగుతున్న ఉప ఎన్నికలలో అభ్యర్థులుగా బరిలోకి దిగాలని పలువురు కాంగ్రెస్ నాయకులు ఆశించినప్పటికీ.. బలమైన అభ్యర్థిగా సునీతాలక్ష్మారెడ్డిని రంగంలోకి దింపామని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. బుధవారం ఉదయం సునీతాలక్ష్మారెడ్డికి ఆయన బీఫారం అందించారు. అనంతరం పొన్నాల విూడియాతో మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో సునీత తప్పకుండా విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్ ఇచ్చిన హావిూలను నెరేవర్చకుండా తాత్సారం చేస్తోందని విమర్శించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ద్వారా టీఆర్‌ఎస్‌కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. మెదక్ ఉప ఉన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పాలక వర్గానికి గుణపాఠం చెప్పేలా ఎన్నికల ఫలితాలు ఉంటాయన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, అదే కాంగ్రెస్‌ను గెలిపిస్తుందన్నారు. అనంతరం సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా తనను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. మూడు నెలల టీఆర్‌ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. ఇచ్చిన హావిూలను టీఆర్‌ఎస్ సర్కారు విస్మరించిందని విమర్శించారు. విద్యార్థులు, రైతులు, ప్రజలు తమను ఆదరిస్తారని, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం అని ఆశాభావం వ్యక్తం చేశారు. తమకు ఎన్నికల్లో ప్రధాన పోటీ ఉందంటే అది టీఆర్‌ఎస్‌తోనేనని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకం ఉందన్నారు. మెదక్‌లో పార్టీని గెలుస్తుందని, తన గెలుపును సోనియా, రాహుల్‌లకు కానుకగా ఇస్తానని తెలిపారు.
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డిని బీజేపీ మెదక్ లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న జగ్గారెడ్డి పేరు అనూహ్యంగా తెరపైకి రావడం పార్టీ శ్రేణుల్లో గందరగోళం సృష్టించింది. జగ్గారెడ్డి బుధవారం ఉదయమే బీజేపీలో చేరారు. ఆ వెంటనే ఆయనను తమ పార్టీ మెదక్ లోక్‌సభ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. అంతకు ముందు పార్టీ అభ్యర్థిగా అంజిరెడ్డి పేరు ఖరారు అయినట్లు వార్తలు వెలువడినా.. పార్టీ నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు. అనూహ్యంగా జగ్గారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. బుధవారం ఉదయం ఆయన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆయనకు కిషన్‌రెడ్డి బీఫారం అందజేశారు.సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత జగ్గారెడ్డి పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బీజేపీ నేతలతో సంప్రదింపులు ప్రారంభించారు. ఆయన కమల దళంలో చేరనున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆయన వాటిని ఖండించారు. అదే సమయంలో ఇటీవల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను కలిశారు. దీంతో జగ్గారెడ్డి పార్టీ మారడం ఖాయమైందని అప్పుడే నిర్ధారణ అయింది. అయితే, తాను మర్యాదపూర్వకంగానే కలిశానన్న ఆయన.. పార్టీ మారడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అయితే, పవన్‌తో భేటీలోనే ఆయన బీజేపీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని, మెదక్ టికెట్ ఇప్పించాలని కోరినట్లు తెలిసింది. దీంతో పవన్ బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులు జరిపి టికెట్ వచ్చేలా చేశారని సమాచారం. కొంతకాలంగా జరుగుతున్న అంతర్గత చర్చలు కొలిక్కి రావడంతో జగ్గారెడ్డి బుధవారం ఉదయం కిషన్‌రెడ్డిని కలిసి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు, టికెట్ తమకే దక్కుతుందని ఆశించిన పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చిన వారికి టికెట్ కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తూర్పు జయప్రకాశ్‌రెడ్డి పేరున అధికారికంగా ప్రకటించడంతో ఆశావాహులంతా షాక్‌కు గురయ్యారు.మెదక్ జిల్లాలో జగ్గారెడ్డి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఏబీవీపీ కార్యకర్తగా బీజేపీలో చేరి రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. 2004లో సంగారెడ్డి నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే, వైఎస్ రాజశేఖరరెడ్డి ‘ఆపరేషన్ ఆకర్ష్’తో ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారు. పార్టీని ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత 2009లో సంగారెడ్డి నుంచి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కొంటున్న ఆయనకు విప్ పదవి లభించింది. దూకుడుగా వ్యవహరించే జగ్గారెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడి ప్రజల్లో చులకనయ్యారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందారు. ప్రస్తుతం బీజేపీ ఒక బలమైన శక్తి ఉందని.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. మెదక్ ఉప ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు అందరి దృష్టి మెదక్ లోక్‌సభ నియోజకవర్గంపైనే ఉందని తెలిపారు. తనను ఎంపీగా ఎన్నుకుంటే మెదక్ లోక్‌సభ నియోజకవర్గానికి భారీగా నిధులు తీసుకువస్తానని, ఎన్నో అభివృద్ధి పనులు చేస్తానని హామీనిచ్చారు. ఆయన వెంట బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్‌రెడ్డి, ఎల్.రమణ తదితరులు ఉన్నారు.