ఖమ్మంలో తెదేపా ఖాళీ

CC

తుమ్మలతో సహా ముఖ్య నేతలంతా రాజీనామా

టిఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహూర్తం

ఖమ్మం, ఆగస్టు 30 (జనంసాక్షి) : ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయింది. శనివారం తుమ్మలతో సహా ముఖ్య నేతలంతా రాజీనామా చేయడంతో ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాజీనామా చేసిన వారంతా టిఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహుర్తం ఖరారయింది. ఇంతకాలం గూడుకట్టుకున్న అసంతృప్తి బద్దలయ్యింది. పార్టీకి పునాదిగా ఉన్న నేతలంతా రాజీనామా ప్రకటించారు. టిడిపిలో బలమైన నాయుడిగా ఉన్న తుమ్మల నాగేశ్వర రావు తదితరులు రాజనీమా చేశారు.  వీరంతా త్వరలో తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ సీనియర్‌ నేత తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు పంపారు. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నా అనే ఏకవాక్యంతో తుమ్మల ఈ లేఖను పంపారు. తుమ్మలతోపాటు ఎమ్మెల్సీ బాలసాని, ఖమ్మం జిల్లా టిడిపి అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు, జడ్పీ చైర్‌పర్సన్‌ కవిత, డీసీసీబీ చైర్మన్‌ మొవ్వా విజయబాబు పార్టీకి రాజీనామా చేశారు. తుమ్మల నాగేశ్వరరావు వచ్చేనెల 5న టిఆర్‌ఎస్‌లో  చేరనున్నట్లు సమాచారం. వీరంతా  చేరితే టిఆర్‌ఎస్‌ బలం పెరగడమే గాకుండా జడ్పీతో పాటు,డిసిసిబి  కూడా టిఆర్‌ఎస్‌ ఖాతాలో పడనుంది. మొత్తానికి ఊహాగానాలను తెరదించుతూ ఖమ్మం జిల్లాలో టీడీపీకి పట్టున్న ఆ పార్టీ సినీయర్‌ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా టీడీపీ ఖాళీ అయినట్లేనని భావించాలి. తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తుమ్మల ప్రకటించారు. తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపారు. ‘నేను పార్టీకి రాజీనామా చేస్తున్నా’ అనే ఏకవాక్యంతో తుమ్మల రాజీనామా లేఖను పంపారు. తుమ్మలతో పాటు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబులతోపాటు డీసీఎంఎస్‌ చైర్మన్‌ అంజయ్య వివిధ నియోజకవర్గాలకు చెందిన నేతలు తుమ్మల వెంట నడుస్తామని ప్రకటన చేశారు. జిల్లాలో టీడీపీకి చెందిన క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి జిల్లాస్థాయి నేతల వరకూ అంతా తుమ్మల వెంట నడిచేందుకు సిద్ధమవడంతో జిల్లాలో టీడీపీ ఖాళీ అయ్యింది. గ్రామ గ్రామాన ఉన్న పార్టీ కమిటీలు అన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో తుమ్మల కీలక భూమిక పోషించారు. మంత్రి పదవులతో పాటు అనేక కీలక బాధ్యతలు పోషించారు. తుమ్మల నిర్ణయంతో ఖమ్మం జిల్లా రాజకీయ సవిూకరణలు గణనీయంగా మారిపోనున్నాయి. జిల్లాలో టీడీపీకి గట్టి పట్టున్న సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. వచ్చేనెల 5వ తేదీ మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో తుమ్మల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. మరోవైపు వైకాపాకి చెందిన వైరా ఎమ్మెల్యే బాణోత్‌ మదన్‌లాల్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌కు చెందిన ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కూడా రేపోమాపో టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నది. మూడు పార్టీల ముఖ్యనేతలు తమ అనుచరులతో కలిసి టీఆర్‌ఎస్‌లోకి వస్తుండటంతో జిల్లాలో రాజకీయ సవిూకరణాలు కొత్త రూపు సంతరించుకోనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఖమ్మంలో కేవలం ఒకేఒక ఎమ్మెల్యే తో ఉన్న టిఆర్‌ఎస్‌ బలం అనూహ్యంగా పెరగడంతో పాటు టిఆర్‌ఎస్‌ బలోపేతం కానుంది. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబులతోపాటు వివిధ నియోజకవర్గాలకు చెందిన నేతలు తుమ్మల వెంట నడుస్తామని ప్రకటన చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణలు తుమ్మల బాటలోనే వెళతారని ప్రచారం జరుగుతున్నది. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు భారీగా తుమ్మలవెంట టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. తుమ్మల చేరికపై ఇప్పటికే ఆయన అనుచరులు అన్ని మండలాల్లో కార్యకర్తల సమావేశాలు ఏర్పాటుచేశారు. ప్రతి మండలంలోకి తుమ్మల వెంటే నడుస్తామంటూ టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. సెప్టెంబర్‌ 5న ఖమ్మం నుంచి సుమారు 2వేల వాహనాలతో తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌కు ర్యాలీగా బయలుదేరి, టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఖమ్మం నుంచి సూర్యాపేట వరకు వాహనాల శ్రేణి ఉండే విధంగా పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు వైరా ఎమ్మెల్యే  బాణోతు మదన్‌లాల్‌ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ విజన్‌ చూసి టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నా. నా వ్యక్తిగత స్వలాభంకోసం కాకుండా కేసీఆర్‌ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారననే ఒక దృఢమైన సంకల్పంతో, నా ప్రజల ఆకాంక్షను మరింత మెరుగుపరిచేందుకు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నా అని ఆయన తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. తనతోపాటు 20మంది సర్పంచ్‌లు 11మంది ఎంపీటీసీలు, పలువురు ఎంపీపీలు వస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరేందుకు తుమ్మల నిర్ణయించుకుంటే, జలగం వెంకట్రావ్‌తో కలిసి నాయకులందరం జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. వారం వ్యవధిలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక ఖమ్మం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఆయన వెంట పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలతోపాటు కనకయ్య టీఆర్‌ఎస్‌లో చేరే అంశంపైనా ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం. ఖమ్మం జిల్లా నుంచి పలు పార్టీలకు చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు అధికార పార్టీలోకి వస్తున్న దరిమిలా వారితోపాటే కనకయ్య కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతారని భావిస్తున్నారు.