తెలంగాణకు ప్రత్యేక ¬దా ఇవ్వండి
ప్రధానితో కేసీఆర్ ప్రత్యేక సమావేశం
మహబూబ్‌నగర్‌లో సోలార్ విద్యుత్ కేంద్రానికి అంగీకారం
విద్యుత్ సమస్యల పరిష్కారానికి మంత్రి గోయల్ హామీ
బిజీబిజీగా సీఎం కేసీఆర్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ¬దా కల్పించాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ శనివారం ఉదయం మోడీతో సమావేశమయ్యారు. దాదాపు అరగంటపాటు సాగిన ఈ భేటీలో కేసీఆర్ 21 ప్రతిపాదనలను ప్రధాని ముందుంచారు. హస్తినలో సీఎం బిజీబిజీగా గడిపారు. మహబూబ్‌నగర్‌లో సోలార్ విద్యుత్ కేంద్రానికి కేంద్రం అంగీకరించింది. ఈమేరకు విద్యుత్ సమస్య పరిష్కారానికి మంత్రి గోయల్ హామీనిచ్చారు. ప్రత్యేక ¬దా, పన్ను రాయితీలు, విద్యుత్, బొగ్గు తదితర అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ ¬దా కల్పించాలని విన్నవించారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలుచేయాలని కోరారు. నూతన రాష్ట్రానికి విద్యుత్, బొగ్గు కేటాయింపులు సహా అన్ని విధాలుగా సాయం చేయాలని కోరారు. ప్రపంచ మెట్రో పోలీస్ సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు రావాలని మోడీని ఆహ్వానించారు. ఇందుకు ఆయన అంగీకరించారు. అలాగే, కేసీఆర్ చేసిన విజ్ఞప్తులపైనా ప్రధాని సానుకూలంగా స్పందించారు. కుటుంబ పెద్దగా రాష్టాల్ర సమస్యలను తీర్చేందుకు ముందుంటానని, తెలంగాణకు అన్ని విధాలుగా సాయం చేస్తామని హావిూ ఇచ్చారు.
‘ప్రత్యేకం’గా చూడండి
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ¬దా కల్పించాలని కేసీఆర్ మోడీని కోరారు. నూతన రాష్టాన్రికి పన్ను రాయితీలు కల్పంచాలని విజ్ఞప్తిచేశారు. అలాగే విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుచేయాలని విన్నవించారు. తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్‌లో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)ని తరలించవద్దన్నారు. హైదరాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేయాలని, వరంగల్-హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుచేయాలని కోరారు. సీఎస్టీకి నష్టపరిహారం చెల్లించాలన్నారు. అలాగే, విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణలో 4 వేల మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అందుకు అవసరమైన బొగ్గును కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. అదనంగా మరో 500 మెగావాట్ల విద్యుత్ కేటాయించాలని విన్నవించారు. అలాగే, తెలంగాణలో వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్‌ప్లాంట్ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. ఎలక్టాన్రిక్ మానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌తోపాటు జహీరబాద్‌లో నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మానుఫ్యాక్టరింగ్ యూనిట్ ఏర్పాటుచేయాలని కోరారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయాలని, వెనుకబడిన ప్రాంతాలకు రహదారులు వేయాలని కోరారు. తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. శాశ్వత తాగునీటి పథకం చేపడుతున్న వాటర్‌గ్రిడ్‌కు నిధులు ఇవ్వాలని విన్నవించారు. కేసీఆర్ చెప్పిందంతా శ్రద్ధగా ఆలకించిన మోడీ.. తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. గతంలో విూరు కోరిన వాటిలో చాలా వరకు నెరవేర్చామన్నారు. హార్టికల్చర్ యూనివర్సిటీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, ఎన్టీపీసీ ఏర్పాటు వంటి వాటిపై సత్వరమే స్పందించామని మోడీ గుర్తు చేశారు. ఎన్టీపీసీ ఏర్పాటు, బొగ్గు కేటాయింపుపై అక్కడికక్కడే అధికారులతో మాట్లాడారు. కుటుంబ పెద్దగా రాష్టాల్ర సమస్యలను తీర్చేందుకు కేంద్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారని మోడీ చెప్పారని టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు. ప్రధానితో కేసీఆర్ భేటీ ముగిసిన అనంతరం ఆయన ఎంపీ వినోద్‌తో కలిసి విూడియాతో మాట్లాడారు. అరగంటసేపు జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పినదంతా మోడీ శ్రద్ధగా ఆలకించారన్నారు. 21 అంశాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. అన్నింటికీ ప్రధాని సానకూలంగా స్పందించారన్నారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం, హార్టికల్చర్ యూనివర్సిటీ వంటి వాటిపై నిర్నయం తీసుకున్నామని తెలిపారన్నారు. స్మార్ట్ సిటీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు, ప్రతిపాదనలు ఇవ్వాలని ప్రధాని కోరారన్నారు. సమగ్ర సర్వే ద్వారా గత ప్రభుత్వాల తప్పులు బయటపడ్డాయని ఎంపీ వినోద్ చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వేను ప్రధాని పరిశీలిస్తామని చెప్పారు.
విద్యుత్ సమస్యల పరిష్కారానికి హావిూ
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయెల్ హావిూఇచ్చారు. కేంద్రం వద్ద అందుబాటులో ఉన్న విద్యుత్‌ను సరఫరా చేసేందుకు దక్షిణ గ్రిడ్ అనుసంధానం లేకపోవడం వల్ల ఏం చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల ఎకరాల భూమి కేటాయిస్తే సోలార్ పవర్ కేంద్రం ఏర్పాటుచేస్తామన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం విద్యుత్ శాఖ మంత్రి గోయెల్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో విద్యుత్ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం వద్ద అందుబాటులో ఉన్న విద్యుత్ నుంచి 500 మెగావాట్లు అదనంగా కేటాయించాలని కోరారు. అలాగే, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4వేల మెగవాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం బొగ్గు కూడా కేటాయించాలని విన్నవించారు. తెలంగాణను ప్రత్యేక కేసుగా పరిగణించి కేంద్రం ఆదుకోవాలని కోరారు. అనంతరం గోయెల్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్రాల సహకారంతో విద్యుత్ సమస్య పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. తెలంగాణలో 4 వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని విభజన బిల్లులో ఉందని మంత్రి గుర్తు చేశారు. తొలి విడతలో 1320 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే ఎన్టీపీసీ ఏర్పాటు కోసం సర్వే పూర్తయిందన్నారు. అవసరమైన బొగ్గు కేటాయింపులు కూడా జరిగేలా చూస్తామని హావిూ ఇచ్చారు. సోలార్ పవర్ కేంద్రం ఏర్పాటుకు అంగీకారం తెలిపిన కేంద్ర మంత్రి.. స్థలం చూపిస్తే మంజూరు చేస్తామన్నారు. మహబూబ్‌నగర్‌లో వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తామని.. ఐదు వేల ఎకరాల స్థలాన్ని చూపించాలని ముఖ్యమంత్రికి సూచించారు.
బిజీబిజీగా సిఎం పర్యటన
సీఎం కేసీఆర్ ఢిల్లీలో వరుస భేటీలతో బిజీబిజీగా గడిపారు. ఉదయం ప్రధాని మోడీతో సమావేశమైన కేసీఆర్ రాష్టాన్రికి కావలిసిన దాదాపు 21అంశాలపై చర్చించారు. ఏపీ పునర్విభజన బిల్లు సెక్షన్ 94(ఐ) ప్రకారం తెలంగాణకు రావల్సిన పన్ను మినహాయింపులు, రాష్టాన్రికి 4000 వేల మెగావాట్ల విద్యుత్ కేంద్ర ఏర్పాటు, దానికి కావలసిన బొగ్గు కేటాయింపులు, మహబూబ్‌నగర్ జిల్లాలో 1000 మెగావాట్ల సోలార్ పార్క్, ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీతోపాటు మొత్తం 21 అంశాలపై సీఎం కేసీఆర్ ప్రధానితో చర్చించారు. ప్రధాని మోడీ అనంతరం విద్యుత్ మంత్రి గోయల్ భేటీ అయి రాష్ట్రంలో విద్యత్ సమస్య గురించి వివరించారు. ఏపీ నుంచి రావల్సిన 500మెగావాట్ల విద్యుత్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పాలమూరు జిల్లాలో సోలార్ ప్రాజెక్టుకు మంత్రి గ్రీన్‌సిగ్నలిచ్చినట్లు తెలుస్తోంది. అంతకు మందు రాష్ట్రపతి ప్రణ్‌ముఖర్జీని కూడా సీఎం కలిశారు. అనంతరం న్యాయశాఖ మంత్రితో భేటీ అయి ఏపీకి కొత్త హైకోర్టును ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు ఇతర అంశాలకు సంబంధించి ఏర్పడిన న్యాయ వివాదాలతోపాటు ఇతర అంశాలపై కేంద్ర మంత్రితో కేసీఆర్ చర్చిస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర సమస్యలను జాతీయ నేతలకు వివరించేందుకు ఇవాళ సీఎం ఢిల్లీలో సుడిగాలిలా పర్యటించారు.