తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ప్రార్థించండి

C

నిరుపేద ముస్లిం యువతి పెళ్లికి రూ.51వేలు నజరానా

వెయ్యికోట్ల బడ్జెట్‌ ఘనత మాదే

ముస్లింల సంక్షేమానికి కట్టుబడ్డాం

పవిత్ర హజ్‌ యాత్రికులనుద్దేశించి సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి) :

నూతనంగా ఏర్పడిన తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసం హజ్‌లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. సోమవారం హైదరాబాద్‌ నాంపల్లి హజ్‌హౌస్‌ నుంచి రెండో విడతగా బయలుదేరిన హజ్‌ యాత్రికులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుపువేగంతో దూసుకుపోవాలని ప్రార్థిం చాలని సూచించారు. నిరుపేద ముస్లిం యువతి వివాహానికి రూ.51వేలు ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తామన్నారు. రూ.వెయ్యికోట్ల బడ్జెట్‌ ముస్లింలకు కేటాయించడం టీఆర్‌ఎస్‌ సర్కారు ఘనతేనన్నారు. ముస్లింల సంక్షేమానికి అన్నివిధాలా కట్టుబడి ఉన్నామని మరోమారు స్పష్టంచేశారు. హిందూ ముస్లిం ఐక్యత ప్రదర్శించే గంగా జమున సంస్కృతిని కొనసాగించేం దుకు ప్రార్ధనలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా అంతకుముందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెలంగాణది గంగా జమున తాహిజీబ్‌ అని, ఆ వార సత్వాన్ని కొనసాగించడానికి తెలంగాణ ప్రభుత్వం కంకణబద్ధమైందన్నారు.     తెలంగాణ సర్కారు పూర్తి సెక్యు లర్‌ రాష్ట్రంగా కొనసాగుందని అన్నారు. ఉపవాస దీక్ష చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో దీక్ష చేసేవారికి సహ కరిస్తే కూడా అంతే పుణ్యం కలుగుతుందన్నారు. అలాగే హజ్‌యాత్రకు వెళ్ళడం ఎంత పుణ్యకార్యమో యాత్రి కులకు సహకారం అందించడమూ అంతే పుణ్యకార్య మన్నారు. తెలంగాణ ప్రభుత్వం హజీల సౌకర్యాల్లో నిమ గ్నమైందన్నారు. గతంలో నిరుపేద ముస్లింల సామూహిక వివాహాల్లో ప్రభుత్వాలు నాసిరకమైన వస్తువులు అందజేశాయని, ఇప్పుడు అలా కాకుండా తమ ప్రభుత్వం రూ.51వేలు నగదు అంద జేస్తుందని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, నగర మేయర్‌ మాజిద్‌ హుస్సేన్‌, సికింద్రాబాద్‌ ఎంపీ బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.