ఆడబిడ్డలకు అత్యంత రక్షణ

CCC
పోలీసు నియామకాల్లో 33శాతం రిజర్వేషన్‌

సత్వర న్యాయం కోసం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటుచేయండి

సీఎంకు భద్రత కమిటీ నివేదిక

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) : ఆడబిడ్డలకు అత్యంత రక్షణ కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పోలీసు నియామకాల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, సత్వర న్యాయం కోసం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు భద్రత కమిటీ నివేదిక ఇచ్చింది. మహిళ, బాలిక భద్రత, రక్షణపై ఏర్పాటైన కమిటీ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక శనివారం సమర్పించనుంది. మహిళ భద్రతకు సంబంధించి పలు కీలక సిఫార్సులు చేసింది. పోలీసు నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని ప్రభుత్వానికి సూచించింది. మహిళలు, బాలికల భద్రత కోసం ప్రభుత్వం ఏడుగురు సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుణులతో కమిటీ వేసిన సంగతి తెలిసిందే. అన్ని వర్గాల ప్రజలు, నిపుణుల నుంచి పూనం మాలకొండయ్య నేతృత్వంలోని కమిటీ అభిప్రాయాలు సేకరించింది. శనివారం సచివాలయంలో సమావేశమైన కమిటీ.. ప్రాథమిక నివేదికను సిద్ధంచేసింది. మహిళలు, బాలికల భద్రత కోసం పలు కీలక సిఫార్సులు చేస్తూ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించనుంది. రెండు నెలల తరువాత పూర్తిస్థాయి నివేదిక సమర్పించనుంది. మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. పోలీసు నియామకాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరింది. అలాగే, హైదరాబాద్‌లో ఫిర్యాదు రాగానే స్పందించేందుకు క్విక్‌ యాక్షన్‌ టీమ్‌లు ఏర్పాటు చేయాలని తెలిపింది. సాఫ్ట్‌వేర్‌ వంటి రంగాల్లో పని చేసే మహిళల కోసం ప్రత్యేక భద్రతా చర్యలు