ప్రతి ఇంటికీ నల్లా నీరు
రూ.27వేల కోట్లతో వాటర్‌గ్రిడ్
రూ.300కోట్లతో సమగ్ర సర్వే
ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (జనంసాక్షి) : ప్రతి ఇంటికి నల్లా నీరు అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఫ్లోరైడ్ బాధిత జిల్లా అయిన నల్గొండ నుంచి ఈ కార్యక్రమం మొదలుపెడతామన్నారు. సోమవారం వాటర్‌గ్రిడ్‌పై సచివాలయంలో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సవిూక్షించారు. రూ.27వేల కోట్లతో వాటర్‌గ్రిడ్ ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. రూ.300 కోట్లతో సమగ్ర సర్వే చేస్తామన్నారు. వాటర్‌గ్రిడ్‌కు సంబంధించి సమగ్ర సర్వేకు రూ. 300 కోట్లు కేటాయించింది. నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 24 వాటర్ గ్రిడ్ల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. వాటర్‌గ్రిడ్ ఏర్పాటు సర్వే కోసం రూ.317కోట్లు ఖర్చవుతాయని ప్రభుత్వ అంచనా వేసింది. వాటర్ గ్రిడ్ల ఏర్పాటుకు రూ.27కోట్లవుతుందని ప్రాథమిక అంచనా వేశారు. ఫ్లోరోసిస్ సమస్యతో బాధపడుతున్న నల్లగొండ జిల్లాలో వాటర్‌గ్రిడ్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నట్టు సమాచారం. ఇక్కడి నుంచే ఈ పథకాన్ని చేపట్టాలని నిర్ణయించారు. వాటర్‌గ్రిడ్ ద్వారా పరిశ్రమలకు, మున్సిపాలిటీలకు నీరందించేందుకు ప్రభుత్వం పథకం రూపకల్పన చేసినట్టు సమాచారం. ప్రభుత్వం 2018 నాటికి వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తిచేయాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వం 2050 వరకు వర్తించే విధంగా దీర్ఘ కాలిక ప్రణాళిక రూపొందించింది. ప్రభుత్వం వాటర్ గ్రిడ్ నిర్వహణ బాధ్యతను ఆర్ డబ్ల్యూఎస్ కు అప్పగించింది. ఇందులో మున్సిపాలిటీలకు అందిస్తున్న నీటి సరఫరాను కూడా చేర్చే ఆలోచన ఉంది. పట్టణాల్లో 150, పల్లెల్లో 100 లీటర్ల నీటిని ఒక్కొక్కరికి అందించాలన్నది లక్ష్యంగా ఉంది. సవిూక్షలో సిఎస్ రాజీవ్‌శర్మ, మంత్రి కెటిఆర్ తదితరులు పాల్గోన్నారు. ఇదిలావుంటే విద్యుత్ సమస్యపై సీఎం కేసీఆర్ సచివాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా పంటలను కాపాడే అంశంపై అధికారులతో చర్చించినట్టు సమాచారం. ఎంతఖర్చయినా విద్యుత్‌ను కొనుగోలు చేసి పంటలను కాపాడాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పంటల కోసం రైతులు ఆందోళనకు దిగడంతో సమస్యను చర్చించారు.