ఉత్తరాంధ్ర అతలాకుతలం
తీరం దాటినా తగ్గని ప్రభావం
స్తంభించిన రవాణా, సమాచార వ్యవస్థ
నిలిచిన విద్యుత్, అంధకారంలో విజయనగరం, విశాఖ
భారీ పంటనష్టం, బీభత్సం మిగిల్చిన హుదూద్ తుపాను
హైదరాబాద్, అక్టోబర్ 12 (జనంసాక్షి) : హుదూద్ ధాటికి ఉత్తరాంధ్ర అతలాకుతలమైంది. తుపాను తీరం దాటిని ప్రభావం తగ్గటం లేదు. దీంతో రవాణా, సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో విజయనగరం, విశాఖపట్నం అంధకారంలో మగ్గుతోంది. ఈ తుపాను భారీ పంటనష్టంతోపాటు బీభత్సం మిగిల్చింది. ‘హుదుద్’ పెనుతుపాను తాకిడికి ఉత్తరాంధ్ర జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి.పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు ఆ జిల్లాలను ముంచేశాయి. ముఖ్యంగా విశాఖ నగరం తీవ్రంగా దెబ్బతింది. భారీ వర్షాలకు పలు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. రహదారుల్లో నీరు పొంగిపొర్లుతున్నాయి. ఈదురుగాలులతోపాటు భారీ వర్షం పడటంతో విశాఖలో జనజీవనం అస్తవ్యస్తమైంది. రహదారులపై చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్, రవాణా వ్యవస్థలు స్తంభించాయి. హుదుద్ తుపాన్ కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దుచేయడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆదివారం నిర్మానుష్యంగా కన్పించింది. రైళ్లను బోయగూడలోని రైల్వే వర్కుషాపు వద్ద నిలిపివుంచారు. రైళ్ల రద్దుతో సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పడంలేదు.
తీరప్రాంతాల్లో నలుగురు మృతి
హుదూద్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతాలపై విరుచుకుపడింది. భారీ వర్షాలు, భీకర గాలులతో అతలాకుతలం చేసింది. దాదాపు 200 కిలోవిూటర్ల వేగంతో ప్రపంచ గాలులు వీస్తున్నాయి. తుఫాన్ కారణంగా సంభవించిన విధ్వంసానికి నలుగురు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు రెండున్న లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒడిశాలో లక్ష మందిని పునరావాస కేంద్రాలకు పంపారు. ఇంకా వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. తుపాను ప్రభావం ఎక్కువగా విశాఖ నగరంపై పడింది. ప్రపంచ పవనాల ధాటికి చెట్లు, విద్యుత్ సంభాలు కూలిపోయాయి. ముందుజాగ్రత్తగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, రవాణా వ్యవస్థను నిలిపివేశారు. తుఫాన్ కారణంగా ఇప్పటివరకు 70 ఇళ్లు దెబ్బతిన్నాయని, 34 జంతువులు మృతిచెందాయని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మంత్రి ఆదివారం సాయంత్రం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు, ఒడిశాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
నిలువునా ముంచేసిన హుదూద్
హుదూద్ తుపాన్ విధ్వంసంతో తమను నిలువునా ముంచేసిందని విశాఖపట్నం షిప్పింగ్ హార్బర్‌లోని మత్స్యకారులు ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం మత్స్యకారులు
మాట్లాడుతూ తుపాన్ బీభత్సానికి 60మరబోట్లు దెబ్బతిన్నాయని చెప్పారు. ఒక్కో మరబోటు విలువ రూ.40 లక్షలు ఉంటుందని అన్నారు. దాదాపు రూ. 30 కోట్ల మేర నష్టపోయామని అన్నారు. ఈదురుగాలులు, అలల తాకిడికి మరబోట్లు హార్బర్‌లోని జెట్టీపైకి కొట్టుకువచ్చాయని తెలిపారు. తమను అదుకోవాలని మత్స్యకారులు ప్రభుత్వానికి
విజ్ఞప్తి చేశారు. హుదూద్ తుఫాన్.. విశాఖ విమానాశ్రయంపై విరుచుకుపడింది. చండప్రచండంగా వీచిన ఈదురుగాలులకు ఎయిర్‌పోర్టు బాగా దెబ్బతింది. విమాశ్రాయం
టెర్మినల్ పైకప్పు, అద్దాలు ధ్వంసమైయ్యాయి. సూచికలు, ¬ర్డింగ్స్ దెబ్బతిన్నాయి. శిథిలాలు ప్రయాణికులు వేచివుండే గదిలోకి పడిపోయాయి. ఎయిర్‌పోర్టుల పరిసర
ప్రాంతాల్లో చెట్లు విరిగిపోయాయి. మరోవైపు భారీ వర్షాలతో రన్ వేపైకి నీరు చేరింది. ఫలితంగా విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది.