ఆంధ్రాలో ఘోరం

4444

పటాకుల పేలుడు ప్రమాదంలో 12మంది మృతి

ఆరుగురి తీవ్రగాయాలు, నలుగురి పరిస్థితి విషమం

హౖేెదరాబాద్‌/కొత్తపల్లి, అక్టోబర్‌ 20 (జనంసాక్షి) :

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోరం జరిగింది. పటాకుల పేలుడు ప్రమా దంలో 12 మంది మృత్యువాత పడ్డారు. ఆరుగురికి తీవ్రగా యాలయ్యాయి. నలుగరి పరిస్థితి విషమంగా ఉంది. తూర్పుగో దావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో జరిగిన బాణా సంచా ప్రమాదంలో 12మంది మృతిచెందారు. కాకినాడ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురిలో నూకరత్నం అనే వ్యక్తి మృతిచెందాడు. దీంతో మృతుల సంఖ్య 12కు చేరింది. స్వల్ప గాయాలైన మరో ఇద్దరు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొం దుతున్నారు. ప్రమాదం వివరాలు తెలుసుకున్న ¬ంమంత్రి చినరా జప్ప, మాజీ మంత్రి మాణిక్య వరప్రసాద్‌, కాకినాడ ఎంపీ తోట నర సింహం, ఎమ్మెల్యే వర్మ, కలెక్టర్‌ నీతూకుమారి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. సహాయ చర్యలను పర్యవేక్షిం చారు. మృతులకు నష్టపరిహారం చెల్లించే విషయంపై ముఖ్యమం త్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ¬ంమంత్రి చినరాజప్ప తెలిపారు. అలాగే అనుమతులు లేకుండా నడిపే బాణసంచా కేంద్రా లు మూసివేయాలని, రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టాలని అధికా రులను ఆదేశించారు. టీ కోసం గ్యాస్‌ వెలిగించగా ప్రమాదం జరి గిందని కొందరు, సిగరెట్టు నిప్పురవ్వలు ఎగిరిపడి ప్రమాదం జరిగిం దని కొందరు పేర్కొంటున్నారు. వాకతిప్ప పలుడు ఘటన బాధాకరమని ఘటనపై విచారణకు కలెక్టర్‌ను ఆదేశించానని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన హైదరాబాదులో విలేకరులతో మాట్లాడుతూ 11మంది మృతుల్లో 9 మంది మహిళలున్నారన్నారు. ముఖ్యమంత్రి ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారం ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా వాకతిప్పలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనలో మృతిచెందిన 11మంది మహిళలే ఉన్నారు. వారి పేర్లు ఇవి : ఎ. కాంతం, ఎ. చిన్నబుల్లి, ఎం. బుజ్జమ్మ, ఎం. కుమారి, ఎం. అప్పాయమ్మ, ఎం. పుష్పమ్మ, ఎం. గంగమ్మ, బి, కామరాజు, వి. మంగ, యు. సందీప్తి, ఆర్‌. రత్నం.