తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త

telangana
నేడు హెల్త్‌కార్డులు పంపిణీ

వైద్య ఖర్చులపై పరిమితి లేదు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌, అక్టోబర్‌ 21 (జనంసాక్షి) : దీపావళి పండుగకు ముందు తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త అందింది. నేడు ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఇక నుంచి వైద్య ఖర్చులపై ఎలాంటి పరిమితి ఉండబోదని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చందశ్రేఖర్‌రావు ప్రకటిం చారు. మంగళవారం సచివాలయంలో ఉద్యోగులకు ఆరోగ్యకార్డులపై ఉన్న తాధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీపావళి కానుక ప్రకటించారు. తెలంగాణ ఉద్యోగులకు, పెన్షనర్లకు బుధవారం నుంచి ఆరో గ్య కార్డులను పంపిణీచేయాలని కేసీఆర్‌ నిర్ణయించారు. వైద్య ఖర్చులకు సం బంధించి పరిమితిని కూడా పూర్తీగా ఎత్తివేస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడిం చారు. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తంచేసారు. ముఖ్యమం త్రికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామని ఉద్యోగ సంఘాల జేఏసీ నేత దేవీప్రసాద్‌ అన్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ బుధవారం ఉద్యోగుల హెల్త్‌కార్డులు ప్రారంభించనున్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య ఖర్చులు పూర్తిగా భరిస్తామని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. వైద్య ఖర్చుల పరిమితులను పూర్తిగా ఎత్తివేస్తున్నామని ప్రక టించారు. దీంతో ఉద్యోగ సంఘాల నాయకులు ముఖ్యమంత్రిని అభినందిం చారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని, వారు మరిం త అంకితభావంతో పనిచేయాలని, ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు కృషిచే యాలని కేసీఆర్‌ అన్నారు. గతంలో ఉద్యోగి మొత్తం కుటుంబానికి రూ.2ల క్షల పరిమితితో ప్రభుత్వం ఆరోగ్య పథకాన్ని అమలుచేసేది. దానివల్ల ఉద్యో గులకు లబ్ది జరగటంలేదని, వైద్య ఖర్చులపై వ్యయ పరిమితిని ఎత్తివే యాలని ఉద్యోగ సంఘాలు గత కొంతకాలంగా డిమాండ్‌ చేస్తూ వస్తు న్నాయి. హెల్త్‌ కార్డులపై ఎన్నికలకు ముందు కేసీఆర్‌ ఉద్యోగులకు హావిూ కూడా ఇచ్చారు. ఆ మేరకు మంగళవారం జరిగిన సమావేశంలో కేసీఆర్‌ నిర్ణయం తీసుకొన్నారు.ప్రభుత్వ ఉద్యోగులు , పెన్షనర్ల కుటుంబ సభ్యులకు ఆరోగ్యం కోసం ఎంత ఖర్చైనా ప్రబుత్వమే భరిస్తుందని కేసీఆర్‌ వెల్లడించా రు. ఆరోగ్య పథకం కోసం ఉద్యోగులు వాటా ధనం చెల్లించే నిబంధనను కూడా తొలగిస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. ఉద్యోగులు ఈ పథకం కోసం తమ జీతాల్లోంచి ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేదని, నూటికి నూరు శాతం ఆ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి వెల్లడిం చారు. ప్రభుత్వ ఉద్యోగులు, మరింత అంకిత భావంతో పనిచేయాలని, ఉద్యోగులకు అన్ని విధాలుగా ప్రభుత్వం సహకరిస్తుందని ఈ సందర్భంగా కేసీఆర్‌ అన్నారు. ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు ఉద్యోగులు ప్రణాళికాబద్దంగా కృషిచేయాలని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణలో జోనల్‌ వ్యవస్థ ఉండాలా, వద్దా, ఉంటే ఎలా ఉండాలి, క్యాడర్‌ విధానం ఎలా ఉండాలి, సర్వీసు నిబంధనలు ఎలా ఉండాలి, అనే విషయాలపై ఉద్యోగ సంఘాలు తమ ప్రతిపాదనలను ఉద్యోగ సంఘాల అధ్యక్షులు దేవీప్రసాద్‌కు అందజేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వీటిపై త్వరలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి డా.టి.రాజయ్య, సీఎస్‌ రాజీవ్‌శర్మ, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, ఆర్ధిక శాఖ కార్యదర్శులు నాగిరెడ్డి, రామకృష్ణారావు, ఉద్యోగ సంఘాల నాయకులు దేవీప్రసాద్‌, శ్రీనివాస్‌గౌడ్‌, విఠల్‌ తదితరులు పాల్గొన్నారు.