తెలంగాణకు సైతాన్ చంద్రబాబు
మన పంటలు ఎండగొట్టాలని కంకణంగట్టిండు
ముందు చూపు మాది..
దొంగ చూపు మీది
కృష్ణపట్నం నీ అయ్య జాగిరా !
81టీఎంసీ మాకు వాటా ఉంది
అది ఉమ్మడి ప్రాజెక్టు
మానవత్వంలేని
నీచ ముఖ్యమంత్రివి నీవు
యు ఆర్ చీటర్
తెలంగాణ విద్యుత్ కష్టాలకు కారణం నువ్వే
రుణమాఫీలో ఆంధ్రాను కూడా మోసం చేశావు
అబిడ్స్ నెహ్రూ విగ్రహంకాడ చర్చ పెడుదం రా..
విజయవాడకు రమ్మన్నా వస్తా
ఒక్క ముక్క తప్పున్నా
ముక్కు నేలకురాస్తా హైదరాబాద్, అక్టోబర్ 24 (జనంసాక్షి) : తెలంగాణకు చంద్రబాబునాయుడు సైతాన్‌లా మారాడని ముఖ్యమంత్రి కె.చంద్రశ ేఖర్‌రావు అన్నారు. మన పంటలు ఎలాగైనా ఎండగొట్టాలని బాబు కంకణంగట్టుకున్నాడని విమర్శించారు. కృష్ణపట్నం మీద కోర్టుకు పో యి బాబు బండారం బయటపెడ్తామని హెచ్చరించారు. శుక్రవారం జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మీడి యా సమావేశంలో మాట్లాడారు. శ్రీశైలం నీ అయ్య జాగీరుకాదని, అది ఉమ్మడి ప్రాజెక్టు అని, తెలంగాణకు 81టీఎంసీల వాటా ఉందని స్పష్టంచేశారు. కొంచెం మానవత్వం కూడా లేని నీచ ముఖ్యమంత్రివి నీవు అని బాబును తూర్పారబట్టారు. ‘యు ఆర్ చీటర్’ అంటూ ఘాటుగా విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణలో విద్యుత్ కష్టాలకు ముమ్మాటికీ నీవే కారణమని కుండబద్దలుగొట్టారు. రుణ మాఫీ విషయంలో ఆంధ్రాను కూడా మోసం చేశావని విమర్శిం చారు. అబిడ్స్‌లో ఉన్న నెహ్రూ విగ్రహంకాడ ఈ విషయంపై చర్చకు నీవు సిద్ధమా అని బాబును ప్రశ్నించారు. చర్చించేందుకు విజయ వాడకు రమ్మన్నా తాను సిద్ధమని కేసీఆర్ ప్రకటించారు. తాను మాట్లాడిన మాటల్లో ఒక్క ముక్క తప్పున్నా తన ముక్కు నేలకు రాస్తానని అన్నారు.
కృష్ణపట్నం ప్రాజెక్టులో తెలంగాణకు చెందిన రూ.1050కోట్ల పెట్టుబడులు ఉన్నాయని దాని ద్వారా వచ్చే విద్యుత్ తమకు ఎందుకివ్వరని కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు. కృష్ణపట్నంపై కోర్టులో తేల్చుకుంటామన్నారు. కృష్ణపట్నం ద్వారా వచ్చే 220 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే వాడుకుంటోందన్నారు. సీలేరు ప్రాజెక్టు నుంచి వచ్చే 540.46మెగావాట్లలోనూ తెలంగాణకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వడంలేదన్నారు. మైక్రో ఇరిగేషన్‌కు రూ.300 కోట్లుకేటాయిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కొత్త ఇసుక విధానాన్ని అమలుచేస్తామన్నారు. భూదాన్ బోర్డును రద్దుచేసి సీసీఎల్‌కు అప్పగి స్తామన్నారు. కృష్ణాజలాల వాటాపై సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటా మన్నారు. విభజన చట్టాన్ని ఏపీ సీఎం బాబు అడుగడుగునా ఉల్లం ఘిస్తున్నారన్నారు. చంద్రబాబుతో చర్చకు సిద్ధమని, విజయవాడకు రమ్మన్నా వస్తానన్నారు. తెలంగాణలో 2013లో 0.9మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉండేదని, ప్రస్తుతం డిమాండ్ 167.99 మిలియన్ యూనిట్ల డిమాండ్‌కు పెరిగిందన్నారు. శ్రీశైలంలో 834 అడుగుల వరకు నీటిని వాడుకోవచ్చని 1996లో చంద్రబాబే జీవో ఇచ్చారని, ఇప్పుడు దాన్ని ఆయనే తుంగలోతొక్కుతున్నారని ఆరోపిం చారు. రాష్ట్రంలో ఏం జరుగుతుంతో ఎప్పటికప్పుడు గవర్నర్ దృష్టికి తీసుకుపోతున్నామన్నారు. రైతుల రుణమాఫీపై ప్రతిరోజు సమీక్ష జరుగుతోందన్నారు. విభజన చట్టాన్ని సరిగ్గా అమలుచేయాలని ప్రధానిని కోరనున్నట్లు తెలిపారు. ప్రతి అంశంలోనూ చంద్రబాబు కిరికిరి పెడుతున్నాడని ఆరోపించారు.
తెలంగాణలో 168మిమి విద్యుత్ డిమాండ్
తెలంగాణలో 2013లో 0.9 మిలియన్ యూనిట్ల కొరత మాత్రమే ఉంటే.. ప్రస్తుతం ఎప్పుడూ లేనివిధంగా 167.99మిలియన్ యూనిట్లకు డిమాండ్ చేరుకుందని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ కోసం ఇప్పటివరకు రూ.609.79 కోట్లు ఖర్చుపెట్టి విద్యుత్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. కృష్ణపట్నం, హిందూజా ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు 1,422మెగావాట్ల విద్యుత్ రావాల్సి ఉందన్నారు. శ్రీశైలంలో ప్రస్తుత నీటిమట్టం 857అడుగులు ఉందని 1996లో చంద్రబాబు ఇచ్చిన జీవో ప్రకారం తాము ప్రాజెక్టులో 834 అడుగుల వరకు నీటిని వాడుకోవచ్చన్నారు. తెలంగాణకు విద్యుత్ ఇచ్చే అంశంపై ఏపీ ఈఆర్‌సీ, కేంద్ర సంస్థలు స్పష్టంగా చెప్పాయని గుర్తుచేశారు. కృష్ణా జలాలపై సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటామన్నా రు. పోలవరం ముంపు ప్రాంతాలతోపాటు సీలేరు ప్రాజెక్టును తమ నుంచి అక్రమంగా లాక్కున్నారని ఆ ప్రాజెక్టు నుంచి రావాల్సిన విద్యుత్‌ను కూడా అడ్డుకుంటున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు 3,170మిలియన్ యూనిట్ల విద్యుత్ రావాల్సి ఉండగా 3,080 యూనిట్లు మాత్రమే ఇచ్చారన్నారు.
మైక్రో ఇరిగేషన్‌కు రూ.300కోట్లు
తెలంగాణలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా మైక్రో ఇరిగేషన్ అభివృద్ధి చేసే ఉద్దేశంతో డిప్ ఇరిగేషన్‌కు రూ.300కోట్లు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు కేసీఆర్ తెెలిపారు. ఈ పథకం కింద ఎస్సీ వారికి 100 శాతం సబ్బిడీ, చిన్న రైతులకు 90 శాతం సబ్సిడీ, మిగతావారికి 80 శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిపారు. విజయ డైరీకి పాలు సప్లయి చేసే రైతులకు ప్రోత్సాహకంగా లీటర్‌కు రూ.4 అదనంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. విద్యుత్ విషయంలో చంద్రబాబు వాస్తవ విరుద్ధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జూన్ 2 తర్వాత నిబంధనల ప్రకారం తెలంగాణకు రావాల్సిన విద్యుత్‌ను చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. విద్యుత్ పంపకాల విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు అన్ని అబద్ధాలే చెబుతున్నాడని కేసీఆర్ మండిపడ్డారు. చంద్రబాబు చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలేనని తెలిపారు. పీపీఏల రద్దు చెల్లదని సెంట్రల్ విద్యుత్ అథారిటి చెప్పిందని గుర్తుచేశారు. చంద్రబాబు కుట్రలను ఏపీ ఈఆర్సీ బయటపెట్టిందని గుర్తుచేశారు. పీపీఏల ప్రకారరమే 1422 మెగావాట్ల విద్యుత్ రావాలని తెలిపారు. చంద్రబాబు ప్రతి విషయంలో కిరికిరి పెడుతున్నాడని పేర్కొన్నారు. తెలంగాణకు పట్టిన దెయ్యం చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు కుట్రల వల్ల తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. సీలేరు ప్రాజెక్టును అక్రమంగా లాక్కున్నారని విమర్శించారు. ఇవాళ తెలంగాణ గవర్నమెంట్‌కు ముందు చూపులేదని చంద్రబాబు జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబుది ముందు చూపుకాదని ఆయనలా మాకు దొంగ చూపులేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబువి అహంకార పూరిత మాటలని అన్నారు. తెలంగాణకు విద్యుత్ ఎందుకివ్వరో చూస్తామని ధ్వజమెత్తారు. చంద్రబాబు విషయాన్ని సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటామని హెచ్చరించారు