బాబూ! వట్టిమాట కట్టిపెట్టు
కులీకుతుబ్‌షా ఆత్మ ఘోషిస్తది శ్రీ హైదరాబాద్‌ను నువ్వు అభివృద్ధి చేశావంటే.. శ్రీ లోటెక్కో.. హైటెక్కో.. తెల్వదు
వాన వస్తే నీ ఇంటిముందు మడుగయితది శ్రీ సెట్లర్లు మా బిడ్డలే శ్రీ తలసాని, తీగల, గంగాధర్ తేరాసా తీర్థం
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం శ్రీ సీఎం కే.చంద్రశేఖర్‌రావు
హైదరాబాద్, అక్టోబర్ 29
(జనంసాక్షి) :
‘చంద్రబాబూ.. వట్టిమాటలు కట్టిపెట్టు.. హైదరాబాద్‌ను నువ్వు అభివృద్ధి చేశావంటే కులీకుతుబ్‌షా ఆత్మ ఘోసిస్తది’.. అని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఘాటుగా విమర్శించారు. లోటెక్కో, హైటెక్కో తెల్వదు గానీ వాన వస్తే నీ ఇంటిముందే నీరు మడుగులా నిలుస్తుందని అన్నారు. సెట్లర్లు తెలంగాణ బిడ్డలేనని చెప్పారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతానని హామీనిచ్చారు. కేసీఆర్ సమక్షంలో టీడీపీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ టీఆర్‌ఎస్‌లో చేరారు. టీకేఆర్ కళాశాల ప్రాంగణంలో బుధవారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది. వీరికి గులాబీ కండువా కప్పి సీఎం పార్టీలోకి ఆహ్వానించారు. బంగారు తెలంగాణ సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన అనంతరం ఆయన మాట్లాడారు. తన నియోజకవర్గ ప్రజల బాగు కోసమే టీఆర్‌ఎస్‌లో చేరానని స్పష్టం చేశారు. తన జీవితంలో ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. గత పాలకులు కరెంట్ విషయంలో కుట్రలు చేసి ఇప్పుడు సీఎం కేసీఆర్‌ను నిందించడం సరికాదన్నారు. తెలంగాణలో కరెంట్ కోతలకు చంద్రబాబే కారణమని ధ్వజమెత్తారు. పీపీఏలను చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేయడం దారుణమన్నారు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన విద్యుత్‌ను ఆంధ్రా ప్రభుత్వం ఇవ్వకపోవడం సరికాదన్నారు. ప్రతిపక్షాలు కరెంట్ విషయంలో అనవసర రాద్ధాంతం చేయడం మంచిది కాదన్నారు. జంట నగరాల్లో టీఆర్‌ఎస్‌ను బలోపేతం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండాను రెపరెపలాడిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం విూర్‌పేటలోని టీకేఆర్ కళాశాల ప్రాంగణంలో జరుగుతోంది. కళాశాల ప్రాంగణమంతా గులాబీ మయం అయింది. టీఆర్‌ఎస్ జెండాలు రెపరెపలాడాయి. కార్యక్రమానికి తీగల అభిమానులు భారీగా తరలివచ్చారు.