9 శాతం వృద్ధిరేటు సాధ్యం కాకపోవచ్చు

ఢిల్లీ: నానాటికీ క్షీణిస్తున్న ప్రపంచ ఆర్థిక  పరిస్థితులను గమనిస్తోంటే వచ్చే ఐదేళ్లలో 9 శాతం సగటు  వృద్ధి రేటు సాధించడం సాధ్యంకాకపోవచ్చని ప్లానింగ్‌ కమిషన్‌ డిప్యూటీ చైర్‌పర్సస్‌ మాంటెక్‌ సింగ్‌ అహ్లువాలియా అన్నారు. 8-8.5 శాతం మాత్రమే సాధ్యమవుతుండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్టాల ప్లానింగ్‌ బోర్డులు, డిపార్టుమెంట్ల సదస్సు జరుగుతున్న నేపథ్యంలో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ 12వ పంచవర్ష ప్రణాళికపై ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు.