9 నుంచి నిట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
వరంగల్,(జనంసాక్షి): నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ల్లో బీటెక్ మెదటి సంవత్సరం సీటు సాధించిన అభ్యర్థులు సర్టిఫికెట్లు పరిశీలించేందుకు వరంగల్ నిట్‌లో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసినట్లు నిట్ అకడమిక్ డీన్ ప్రొఫెసర్ టి. రమేష్ తెలిపారు. ఈ నెల 9 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతుందని తెలిపారు. విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీనకు ఒక్క నిట్‌లోనే వెరిఫికేషన్ సెంటర్ ఏర్పాటుచేసినట్టు ఆయన వివరించారు. ఆలిండియా ర్యాంకులాధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టంచేశారు. పూర్తి వివరాల కోసం విద్యార్థులు www.csab.in వెబ్‌సైట్‌లో చూడాలని ప్రొఫెసర్ రమేష్ సూచించారు.