ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం

మిడ్జిల్. సెప్టెంబర్ 19.( జనం సాక్షి)
వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మసి గుండ్లపల్లి గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గణేష్ నిమజ్జన వేడుకల సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ అన్నదానానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుని కృపతో ఏటా ఈ ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. కేవలం పూజలు, భజనలకే పరిమితం కాకుండా, ‘అన్నదానం మహాదానం’ అనే సంకల్పంతో ప్రతి ఒక్కరికీ స్వామివారి ప్రసాదాన్ని అందజేయడం సంతోషంగా ఉందన్నారు. , ఉత్సవ కమిటీ సభ్యులు.స్వచ్ఛంద సేవకులు పూర్తి సహకారాన్ని అందించారు.భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్నదాన వేదిక వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వచ్చిన ప్రతి ఒక్కరికీ కమిటీ సభ్యులు స్వయంగా వడ్డించి, క్రమశిక్షణతో ప్రసాద వితరణ సాగేలా పర్యవేక్షించారు. అన్నదాన కార్యక్రమం విజయవంతం కావడంతో నిర్వాహకులు భక్తులకు, సహకరించిన కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి గోద శ్రీశైలం. ఉప సర్పంచ్ జనార్ధన్. ప్రదీప్ రెడ్డి. భీమ్ రాజు. మల్లేష్. శేఖర్. బాల్రెడ్డి. తిరుపతి. బాలయ్య. శ్రీనువాసులు. ఆంజనేయులు. రమేష్. రాములు గౌడ్. మహేష్. సత్తయ్య. కృష్ణారెడ్డి. గోద జంగయ్య. సాకలి కృష్ణయ్య. పాలమూరు కుమార్. సాకలి శ్రీను. సుదర్శన్. అనిల్. చందు. యువకులు ప్రజలు పాల్గొన్నారు.