అక్రమ రిజిస్ట్రేషన్‌పై చర్యలు తీసుకోవాలి
* ఆత్మహత్యయత్నానికి పాల్పడిన రైతు
* ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు యంత్రాంగం
న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో దిగివచ్చిన రైతు
చేర్యాల/మద్దూరు (జనంసాక్షి) జూన్ 06 : తన ప్రమేయం లేకుండా వారసత్వంగా వస్తున్న పట్టా భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మనోవేదనకు గురై ఓ రైతు ఉరేసుకుని ఆత్మహత్య యత్నం చేసుకున్న సంఘటన ఉమ్మడి మద్దూరు మండలంలోని జాలపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వలబోజు నరసింహాచారి తన తండ్రి వారసత్వంగా వస్తున్న పట్టా భూమిని తన ప్రమేయం అక్రమ ధ్రువపత్రాలతో ఇటీవల అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని తనకు అన్యాయం చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇట్టి రిజిస్ట్రేషన్ పై సంబంధిత అధికారులు వెంటనే విచారణ చేపట్టి క్రయవిక్రయాలు చేసిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత రైతు ఆక్రోశం వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణ చర్యలు చేపట్టి న్యాయం చేయాలని బాధిత రైతు వేడుకోగా ఘటన స్థలంలో ఉన్న పోలీస్ యంత్రాంగం సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడంతో బాధిత రైతు దిగివచ్చాడు.



