నల్గొండలో ఒక కుటుంబం అదృశ్యం

పోలీసుల గాలింపు

నల్లగొండ ప్రతినిధి,జూన్ 7,(జనం సాక్షి):నల్గొండ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్ లోని శ్రీనివాస కాలనీకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు శనివారం (06.06.2026) నుంచి కనిపించకుండా పోవడంతో ఆందోళన నెలకొంది.అదృశ్యమైన వారిలో గిరి శ్రీకాంత్ (44), భార్య గిరి లక్ష్మీ (42), కుమార్తె హర్షిత (23), కుమారుడు సాయి చరణ్ (20) ఉన్నారు. వీరు ఆరు సంవత్సరాల క్రితం కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతం నుంచి నల్గొండకు వచ్చి ఇక్కడే నివాసం ఉంటున్నారు. శ్రీకాంత్, లక్ష్మీ దంపతులు పట్టణంలోని కిరాణా దుకాణాల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు.అయితే, జూన్ 6వ తేదీ నుంచి కుటుంబ సభ్యులందరూ కనిపించకపోవడంతో వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.వీరి గురించి ఎవరికైనా సమాచారం తెలిసినట్లయితే నల్గొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్ 8712667670 లేదా ఎస్‌ఐ జె. సైదులు సెల్ నంబర్ 8712577228 ను సంప్రదించాలని పోలీసులు కోరారు.