గ్రామపంచాయతీ స్థలంలో ఇల్లు నిర్మిస్తున్న మహిళపై చర్యలు తీసుకోవాలి
ఎంపీడీవోకు ఫిర్యాదు చేసిన అమీనాబాద్ మాజీ సర్పంచ్ బండి బాలరాజు…
చెన్నారావుపేట, ఏప్రిల్ 10 ( జనం సాక్షి): గ్రామ పంచాయతీకి అప్పగించిన ప్రభుత్వ స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతున్న మహిళ పై చర్యలు తీసుకోవాలని అమీనాబాద్ గ్రామ మాజీ సర్పంచ్ బండి బాలరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం చెన్నారావుపేట ఎంపీడీవో కార్యాలయంలో ఆయేషా పర్వీన్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీనియర్ అసిస్టెంట్ నరేందర్ కు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమీనాబాద్ గ్రామానికి చెందిన దొనికెల బాలమణి తనకు ఉన్న ఇంటి స్థలం ఒక గుంట భూమిని 2017 వ సంవత్సరంలో ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు అప్పటి తహసిల్దార్ సుభాషినికి తన భూమి పత్రాలను అప్పగించింది. అప్పటి నుండి ఆ భూమి గ్రామపంచాయతీ ఆధీనంలోనే ఉంది. ఆ భూమిలో బుల్లె కళావతి అనే మహిళ అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టుటకు ముగ్గు పోసింది. వెంటనే ఆమె పై చర్యలు తీసుకొని ఆ భూమి గ్రామపంచాయతీకి వివిధ అవసరాల కోసం ఉపయోగపడే విధంగా చూడాలని అయన కోరారు.


