దళిత మహిళా మాజీ సర్పంచుల పై దాడి
ఆర్మూర్, సెప్టెంబర్ 23 ( జనం సాక్షి): గ్రామానికి దళిత మహిళా మాజీ సర్పంచులు గా బాధ్యతలు వహించి అభివృద్ధి చేసిన మాపై సర్వజన సంఘం సభ్యులు తీవ్ర పదజాలంతో దుర్భషలాడుతూ దాడి చేసిన ఘటన ఆర్మూర్ మండలంలోని సుబ్బిర్యాల్ గ్రామంలో చోటు చేసుకుంది.గతంలో ప్రభుత్వం 100 గజాల ప్లాట్లను అందించడం జరిగిందని,కొందరు అక్రమంగా జెసిబి తీసుకువచ్చి ప్లాటును కూలగొట్టే ప్రయత్నం చేశారని,దళిత బంధు ద్వారా నిర్మించుకున్న మడిగేలను సైతం సర్వజన సంఘం సభ్యులు తాళం వేసి స్వాధీన పరచుకోవడం జరిగిందని దళిత మాజీ సర్పంచులైన సట్లపల్లి గంగు నర్సు బాయి, సట్లపల్లి సవిత సోమవారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.దళితులమైన మాపై కులం పేరుతో దూషిస్తూ, కింద పడవేసి దాడి చేశారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
సుబ్బిర్యాల్ సర్వ సమాజ్ సభ్యులతో మా కుటుంబానికి ప్రాణహాని ఉందని వారు తెలిపారు.మాపై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.