కేజీబీవీ విద్యార్థునిల పరిస్థితివిషమం?.హైదరాబాద్‌లోని అపోలోకుతరలింపు

 

ముత్తారం కేజీబీవీలో అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో( KGBV students) ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. 53 మంది విద్యార్థినిలు ఆదివారం రాత్రి పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానలో చేరగా.. ఆరోగ్యం కుదుట పడటంతో సోమవారం 39 మందిని, మంగళవారం 6 గురిని డిశ్చార్జి చేశారు. అయితే 8 మందిలో నలుగురికి దగ్గు తీవ్రత తగ్గకపోవడంతో సోమవారం రాత్రి కరీంనగర్‌కు తరలించారు. అక్కడ కూడా ఆరోగ్య పరిస్థితి మెరుగు పడకపోవడంతో రేవతి, సునీత, రక్షితలను హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.