సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి : ఎస్‌ఐ గూగులోతు శ్రీదేవి
జనం సాక్షి తరిగొప్పుల న్యూస్ 30: తరిగొప్పుల మండల కేంద్రంలోని సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తరిగొప్పుల పోలీస్ ఎస్ఐ గుగులోతు శ్రీదేవి అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రజలను ఉద్దేశించి ఎస్సై మాట్లాడుతూ ప్రజలు తమ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను పరిచయం లేని వ్యక్తులతో పంచుకోరాదని సూచించారు. సెల్ ఫోన్ లో వచ్చే లోన్ యాప్ ల జోలికి పోవద్దని, ఫోన్లో వచ్చే అనేక వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయని, సైబర్ నేరాలకు లోనైనా బాధితులు వెంటనే బ్యాంకు వారికి సమాచారం అందిస్తే వెంటనే అకౌంటు బ్లాక్ చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే డ్రగ్స్ మత్తు పదార్థాలకు యువత లోను కావద్దని తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తలు వహించాలని తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



