నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తా

… స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
… నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యం
… మండల పార్టీ అధ్యక్షులను సన్మానించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్‌పూర్, జూలై 06 ( జనం సాక్షి ) :
అవినీతికి తావులేకుండా,నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా కృషిచేస్తానని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ ఘన్పూర్ పట్టణ కేంద్రంలోని ఎస్ కన్వెన్షన్ హాల్లో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులకు, జిల్లా ప్రధాన కార్యద ర్శిలకు, కార్యదర్శి లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి సోమవారం రోజున నూతనంగా ఎన్నికైన స్టేషన్గన్పూర్ మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డిని, పట్టణ అధ్యక్షుడు అంబటి కిషన్ రాజును, చిల్పూర్ మండల అధ్యక్షుడు చిర్ర నాగరాజును, జాఫర్గడ్ మండలాధ్యక్షుడు నూకల ఐలయ్యను, ధర్మసాగర్ మండల అధ్యక్షుడు పెసరు రమేష్ ను, రఘునాథ్ పెళ్లి మండలాధ్యక్షు డు గాదె మహేందర్ రెడ్డిని, వేలేరు మండల అధ్య క్షుడు లక్ష్మణ్ నాయక్ లను సాలవాలతో ఘనం గా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు.రానున్న ఎన్నికలలో రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి, రేవంత్ రెడ్డి ని ముఖ్యమంత్రి చేయాలి, స్టేషన్ ఘనపూర్ నియో జకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే మన ముందు ఉన్న ఏకైక లక్ష్యంగా ప్రతీ ఒక్క కార్యకర్త నిబద్దతతో పని చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు పెట్టడం, మతాల విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప పేద వర్గాల అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దేశంలో మోడీ ప్రభుత్వం పేద బలహీన వర్గాలు, మైనార్టీల హక్కులను కాలరా స్తుందని దీనిని మనందరం ముక్తకంఠంతో వ్యతిరే కించాలని సూచించారు. అందుకే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని మనం కాపాడితే రాజ్యాంగం మనల్ని కాపాడుతుందని చెబుతున్నారని అన్నారు. భారత దేశంలో ఉన్న అణగారిన వర్గాలు, పేదలు, మైనారిటీలు రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉపయోంచుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీని బలపరచాలని, దేశంలో ప్రజా స్వామ్యం మనుగడ సాగించాలి అంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారే తెలంగాణకు సరైన ముఖ్యమంత్రి అని, బిఆర్ఎస్ కు అసలైన మొగాడు కూడా రేవంత్ రెడ్డే అని కొనియాడారు. బిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధరమైన ఆరోపణలు చేస్తుందని ఆరోపించారు.కాళేశ్వరం కుంగిపోవడం వెనకాల కుట్రలు ఉన్నాయని అంటున్న బిఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం కుంగిన తర్వాత 3నెలలు బిఆర్ఎస్ అధికారంలో ఉందని, మరి అప్పుడే ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. బిఆర్ఎస్ కేవలం రైతులను రెచ్చగొట్టాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని అన్నారు. దేవాదుల ద్వారా నియోజకవర్గ రైతులకు సాగు నీరు అందించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. బిఆర్ఎస్ సోషల్ మీడియా యూనివర్సిటీ నడుపుతుందని, సోషల్ మీడియాలో బిఆర్ఎస్ విష ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు. మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులు అందరిని కలుపుకొని పోవాలని సూచించారు. పార్టీని బలోపేతం చేయడం తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే మన కర్తవ్యం అని పేర్కొన్నారు. కమిటీల ఏర్పాటులో 80శాతం పాత కాంగ్రెస్ నాయకులకే అవకాశం కల్పించారా ని తెలిపారు. కడియం శ్రీహరి ఏ పార్టీలో పని చేసిన ఆ పార్టీ విధానాలకు కట్టుబడి పని చేస్తాన ని అన్నారు. పార్టీని బలోపేతం చేయడం, నియో జకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా సంకల్పం వెల్లడించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి, చిల్పూర్ గుట్ట దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, బెలిదే వెంకన్న, లింగాల జగదీష్ చంద్ర రెడ్డి, కోళ్ల రవి గౌడ్, బొమ్మిశెట్టి బాలరాజు, గడ్డ మీద సురేష్ కుమార్, రజాక్, అన్నేబోయిన బిక్షపతి, బేతి జయపాల్ రెడ్డి, నాగరబోయిన శ్రీరాములు, రామకృష్ణ, ప్రసాద్, రత్నాకర్ రెడ్డి, రమేష్, భూక్య సుధాకర్, గుగులో త్ ఉమ్లా నాయక్, 7 మండ లాల ప్రజాప్రతినిధు లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.