రైతుబంధు పాత బకాయిలు పూర్తిగా చెల్లించాలి

బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా సోషల్ మీడియా నాయకులు మజర్

బజార్హత్నూర్ /ఇచ్చోడ జూన్06( జనం సాక్షి):- కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు ఇవ్వాల్సిన రైతు పెట్టుబడి సాయం (రైతుబంధు/రైతు భరోసా) బకాయిలను వెంటనే పూర్తిగా చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా సోషల్ మీడియా నాయకులు మజర్ డిమాండ్ చేశారు.రైతులకు సాగు పెట్టుబడి సకాలంలో అందకపోవడంతో అప్పులు చేసి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. విడతల వారిగా అందించే రైతు భరోసా నిధులను ప్రభుత్వం కొందరికి వేసి మరి కొందరికి వేయట్లేదని మండిపడ్డారు. గత విడతలో నెలకొక ఇష్టాల్మెంట్ చొప్పున ఏకంగా 2 ఏకరాలకే రైతుభరోసా ను పరిమితం చేసి రైతులను మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఎకరాల వారీగా ఎంత మొత్తం బకాయి ఉందో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసి, పెండింగ్‌లో ఉన్న మొత్తాన్ని ఎలాంటి జాప్యం లేకుండా రైతుల ఖాతాల్లో జమ చేయాలని మజర్ డిమాండ్ చేశారు. ఆనాడు కేసీఆర్ చెప్పిన విధంగానే రైతుబంధు కు రాంరాం, దళితబందుకు జైభీం చేశారని, అధికారం కోసం రైతులకు అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 3 సార్లు రైతుబంధు ఎగ్గొట్టిందని, ప్రభుత్వం చూపిన 2026 వానకాల రైతులకు విడుదల చేసిన రైతుబంధు నిధుల నివేదిక ప్రకారం 1,18,92,952.11 ఎకరాలకు గాను 3 విడతల్లో దాదాపు 21 వేల కోట్ల రూపాయలు బాకీ పడిందని వాటిని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని మజర్ డిమాండ్ చేశారు. ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ బాధ్యత అని గుర్తుంచుకుని, రైతుల హక్కైన పెట్టుబడి సాయాన్ని పూర్తిగా చెల్లించాలని, లేనిపక్షంలో రైతులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టవలసి వస్తుందని హెచ్చరించారు.