ఇందల్వాయి మండలంలోని తిరుమనపల్లి తండాలో ఉద్రిక్తత

( జనం సాక్షి) అర్ధరాత్రి తిరుమలయ తండా లో కుటుంబ విషయమై రెండు వర్గాల మధ్య గొడవ…ఇందల్వాయి మండలం గన్నారం శివారులో తిరుమలయ్య తండా లో భార్యాభర్తల విషయమై ఒక వర్గం వారు అర్ధరాత్రి దాడి చేయడానికి రావడంతో పరిస్థితి తండాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన సిఐ వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బలగాలతో ఘటన స్థలానికి చేరుకొని లోపు ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాలను సముదాయించే తరుణము లో ఒక్కసారిగా పోలీసులపై, పోలీసు వాహనంపై దాడులకు పూనుకున్నారు. వెంటనే వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో ఇరువార్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ వెల్లడించారు. అర్ధరాత్రి తండాలో భారీగా పోలీసు బందోబస్తు నిర్వహించారు