తెలంగాణ రాష్ట్ర మైనార్టీ మంత్రి అజారుద్దీన్ ను కలిసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

* ఇచ్చొడ షాదీఖాన మంజూరు చేయాలి
*పోడు భూముల సమస్యలు పరిష్కరించాలి
*ఖబరస్తాన్, ఈద్గాలకు కాంపౌండ్ వాల్ లు మంజూరు చేయాలి
బజార్హత్నూర్/ఇచ్చోడ జూలై 06 ( జనం సాక్షి):- ఇచ్చొడ, గుడిహత్నూర్ మండలంలోని కేషవపట్నం, బాబ్జిపెట్, గుండాల, లింగాపూర్, జోగిపేట్, ప్రజలు ఎదుర్కొంటున్న పొడు భూముల సమస్యల పరిష్కారం కొరకు సోమవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వినతిపత్రంలో పేర్కొన్న సమస్యలు నియోజకవర్గంలోని పొడు సాగుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే, అర్హులైన రైతులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కులు కల్పించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. అలాగే మైనార్టీ వర్గాలకు సంబంధించిన ఖబరస్తాన్, ఈద్గాలకు కాంపౌండ్ వాళ్ళు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా ఇచ్చొడ మండల కేంద్రంలో షాదీఖాన ఏర్పాటు కొరకు ప్రభుత్వం వద్ద ప్రతిపాదన పెట్టడం జరిగిందని దాన్ని కూడా అధికారిక మంజూరు చేయాలని కోరారు.మంత్రి అజారుద్దీన్ కు ఎమ్మెల్యే వినతిపై సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత అధికారులతో సమీక్షించి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేషవపట్నం సర్పంచ్ అల్తాఫ్, సదర్ ఇబ్రహీం, సాదిక్, షేక్ సాదిక్, జాకీర్, ఖమర్, జూమ్మ తదితరులు ఉన్నారు.



