న్యాయం చేయండి సార్

* కొన్నే సర్పంచ్ కోడూరు స్వంత శివకుమార్ గౌడ్

బచ్చన్నపేట జూలై ( జనం సాక్షి): బచ్చన్నపేట మండలంలోని కొన్నే గ్రామానికి చెందిన 100 మంది బీడీ కార్మికులకు న్యాయం చేయాలని గ్రామ సర్పంచ్ కోడూరు స్వర్ణలత శివకుమార్ గౌడ్ జనగామ జిల్లా కలెక్టర్ ను కోరారు. సర్పంచ్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులతో కలిసి కలెక్టర్కు కార్మికుల సమస్యలతో కూడిన వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ 1993లో కొన్నే గ్రామ పరిధిలో గల చొప్పరి ఆగమ్మ కుమారులైన చొప్పరి రామయ్య చొప్పరి నరసయ్య వద్ద నాలుగు ఎకరాల భూమిని బీడీ కార్మికులు ఇంటి నిర్మాణం కొరకు కొనుగోలు చేయడం జరిగిందని కానీ అక్కడ భూమిలో వాటర్ లేకపోవడంతో నిర్మాణాలు ఆగిపోయాయి తరువాత ఆ నాలుగు ఎకరాల నుండి ఎకరం 15 గుంటల కెనాల్ పోవడం జరిగిందని అట్టి డబ్బులు కూడా బీడీ కార్మికులకు 5,50,000 వేయడం జరిగిందన్నారు. కెనాల్ పోయిన తర్వాత మళ్లీ ఒకసారి కార్మికులంతా కలిసి ఎవరి ప్లాటు వాళ్లు చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడంతో చొప్పరి నరసయ్య వారసులు ఈ భూమి మాది అని బీడీ కార్మికులపై కోర్టులో కేసులు వేయడం జరిగిందని కోర్టు చుట్టూ తిరగలేని పరిస్థితిలో ఉన్న బీడీ కార్మికులు కలెక్టర్ కలసి మాభూమి మాకే ఉండాలి అని వినతిపత్రం ఇచ్చామన్నారు. దానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించి భూమికి సంబంధించిన పత్రాలు చూసి తగు చర్యలు తీసుకుంటానని తెలిపారు. కలెక్టర్ కు బీడీ కార్మికులు ధన్యవాదాలు తెలిపారు