చిన్న వయసులో నే ఆగిన గుండె…

రోడ్డు ప్రమాదంలో ఏడేళ్ల బాలుడు మృతి..

మరణిస్తూ ఆరుగురికి పునర్జన్మ…

గంభీరావుపేట జూలై 07(జనం సాక్షి); తల్లిదండ్రులకు తీరని లోటు మిగిల్చిన ఘటన చోటుచేసుకుంది వివరాల్లోకెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన బొంబాయి పాపారావు కూతురు సౌమ్య అల్లుడు రఘు, ఉద్యోగరీత్యా తమిళనాడు రాష్ట్రంలోని తిరునవెల్లి జిల్లా రాధాపురంలో ఉంటున్నారు, వీరి రెండో కుమారుడు అశ్విన్ (7) గత నెల రోడ్డుపై సైకిల్ పై వెళుతుండగా అతి వేగంగా వచ్చిన అంబులెన్స్ ను ఒకసారి ఢీకొట్టడంతో, ఆ బాలుడి తలకు తీవ్ర గాయాలై బ్రెయిన్ డెడ్ అయింది, ఎంత ప్రయత్నించినా బాలుడు బ్రతకడని తెలవడంతో అశ్విన్ తల్లిదండ్రులు తాత పాపారావు, బాలుడి అవయవాలు దానం చేయడానికి నిర్ణయం చేసుకున్నారు, రెండు కిడ్నీలు, కాలేయం, గుండె, రెండు కంటి అవయవాలను ఇతరులకు మార్పిడి చేశారు, ఇంత బాధలోనైనా మిగతా వారికి అవయవ దానం చేయడం మిగతా వారికి పునర్జన్మ ప్రసాదించాడు లింగన్నపేటలో నేడు అంతక్రియలు జరుగుతాయని తెలిపారు.